టాలీవుడ్ లో మొదటినుండి విలక్షణమైన చిత్రాల్లో నటిస్తూ, హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శర్వానంద్. ఇక ప్రస్తుతం అయన హీరోగా రూపొందుతున్న మూడు చిత్రాల్లో ఒకటైన ‘రణరంగం’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన వ్యూస్ తో ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకెళుతోంది. వెరైటీ కథలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించగల సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో, సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
1990ల నాటి ఒక గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగె కథగా రూపొందుతున్న ఈ చిత్రం, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, అలానే ఇప్పటివరకు శర్వానంద్ తన కెరీర్ లో పోషించని ఒక విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర బృందం చెపుతోంది. శర్వా సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ప్రశాంత్ పిళ్ళై సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘సీతా కళ్యాణం’ అనే పల్లవితో సాగే తొలిపాటను ఈనెల 4వ తేదీన సాయంత్రం 4 గం. 5ని. లకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని ఆగష్టు నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


