యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న రెండు చిత్రాల్లో ఒకటి రణరంగం. ఇదివరకు స్వామి రారా, కేశవ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులనుండి మంచి స్పందనను రావాడంతో, నేడు టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ చిత్ర టీజర్ ని బట్టి చూస్తే, 1990 ల కాలంనాటి ఒక గ్యాంగ్ స్టర్ కథగా ఈ చిత్రం రూపొందినట్లు మనకు అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా ఒక విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ‘కొందరికి అతడు క్రిమినల్ అయితే మిగతావారికి అతడు హీరో’ అనే పదాలడైలాగులతో తో ఈ టీజర్ సాగింది.
ఇక టీజర్ లో ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటె సరిపోతుంది, అదే మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’ అని హీరో పలికే డైలాగ్ ఆకట్టుకుంది. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణ్ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందిస్తుండగా, సంగీతాన్ని ప్రశాంత్ పిళ్ళై అందిస్తున్నారు. కాగా చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


