అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యంగ్ హీరోగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నవిషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ మరియు మూడు పాటలు ఇప్పటికే విడువులై యూట్యూబ్ లో మంచి వ్యూస్ సంపాదించాయి. జులై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర బృందం నేడు ఒక వీడియోను విడుదల చేసింది.
అందులో హీరో విజయ్ దేవరకొండతో పాటు ఈ చిత్ర తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వర్షన్లకు పనిచేసిన పలువురు చిత్ర బృందం సభ్యులు ఈ చిత్రంలోని నాలుగవ పాటైన ‘క్యాంటీన్ సాంగ్’ ను అడి, పాడుతూ చిందేయడం చూడవచ్చు. హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ మేకింగ్ వీడియోలో ఉన్నారు. ఈ పాటను ఈనెల 30న ఆదివారం ఉదయం గం.11 ని.11 లకు విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా, శృతి రామచంద్రన్, జయప్రకాశ్, బ్రహ్మాజీ, సుకన్య, రావు రమేష్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు….!!


