విజయనిర్మల గారి అకాల మరణం తో వేడుకలు రద్దు చేసుకున్న ‘మహర్షి’

0
494

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి, అద్భుత విజయాన్ని అందుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక నేటితో విజయవంతంగా 210 కేంద్రాల్లో 50 రోజలు పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ వేడుకను రేపు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చేయాలని నిర్ణయించింది చిత్ర బృందం. అయితే నిన్న రాత్రి సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, శ్రీమతి విజయనిర్మల గారు హఠాన్మరణం చెండంతో ఒక్కసారిగా కృష్ణ గారి కుటుంబం శోకసంద్రం లో మునిగిపోయింది.

ఆ కారణం వలన మహర్షి అర్ధ శతదినోత్సవ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు . తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎనలేని సేవలందించి, కృష్ణ గారి సతీమణిగా ఆయనకు ఎల్లవేళలా తోడూ నీడగా నిలిచిన విజయనిర్మల గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది మహర్షి చిత్ర బృందం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here