“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రాన్ని ప్రశంశించిన వైజయంతి మూవీస్..!!

0
532

నూతన నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా, శృతి శ‌ర్మ హీరోయిన్ గా స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. టాలీవుడ్ తెరపై చాలారోజుల తరువాత డిటెక్టీవ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులు సహా పలువురు చిత్ర ప్రముఖులు సైతం పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, అడివి శేష్, తరుణ్ భాస్కర్ తదితరులు చిత్రం ఎంతో అద్భుతంగా ఉందని, నవీన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించారని మెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన వైజయంతి మూవీస్ వారు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మీద ప్రశంసలు కురిపించారు , ఈ చిత్ర నిర్మాణ సంస్థైన స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ ను, దర్శకుడు స్వరూప్, అలానే నటుడు నవీన్ ను అభినందించారు. ఇక ఈ చిత్రంతో మరొక్కసారి కథాంశమే రారాజు అని నిరూపితమైందని, చిత్రానికి పనిచేసిన యూనిట్ మొత్తానికి తమ తరపున కంగ్రాట్స్ తెలిపారు వైజయంతి మూవీస్ సంస్థ వారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here