రెబల్ స్టార్ కృష్ణంరాజు 79వ పుట్టినరోజు వేడుకలు జనవరి 20వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 40 సంవత్సరాలుగా తన అభిమానులుగా కొనసాగుతున్న 50 మంది సీనియర్ అభిమానులను కృష్ణంరాజు సత్కరించడం విశేషం.
ఉభయ రాష్ట్రాల “రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫాన్స్ అసోసియేషన్” వ్యవస్థాపక అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీ రామచంద్ర శాస్త్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ ఫాన్ గోవిందరావు, వరంగల్ కు చెందిన సీనియర్ ఫాన్స్ కటకం నాగరాజు, శివాజీ, గుంటూరుకు చెందిన శాస్త్రి లతోపాటు షోలాపూర్, బళ్లారి, బెంగుళూర్ వంటి సుదీర్ఘ ప్రాంతాలనుండి వచ్చిన 50 మంది అభిమానులను కృష్ణంరాజు శాలువా, మెమోంటోలతో సత్కరించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ అభిమానులతో ఆప్యాయంగా ముచ్చటించటం విశేషం.


