విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో ‘నాన్న కుట్టి’ అనే సినిమాని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో ము. మారన్ తెరకెక్కించారు. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘దియా నీకు అమ్మ అంటే చాలా ఇష్టమా?’ అని తండ్రి అడగడం.. ఇష్టమే అని పాప చెప్పడం.. ‘నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మను చూడలేదు కదా?’ అని తండ్రి అనడం.. ‘నీకు దేవుడంటే ఇష్టం కదా నాన్న కుట్టి? నువ్వు దేవుడ్ని చూశావా నాన్న కుట్టి? అని పాప చెప్పిన సమాధానంతో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమా ఎమోషన్ ఏంటి అన్నది అర్థం అవుతుంది. ‘మా నాన్నని ఏం అడిగినా కొనిస్తాడు. ఇది అసలు ఓ విషయమే కాదు.. ఆయన ఎంత పెద్దోడో తెలుసా?’ అని పాప చెప్పిన డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌ని అద్భుతంగా చూపిస్తూనే మాస్, యాక్షన్ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని రకాల అంశాలతో సినిమాని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో..
విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ బేస్‌లా ఉంటుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. లిథాన్య పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన బాష్యశ్రీ గారికి థాంక్స్. ‘నాన్న కుట్టి’ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవంబర్ 27న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా మూవీని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ చిత్రాన్ని మగవాళ్లందరికీ అంకితం చేస్తున్నాను. పదేళ్ల వయసుకి నాన్న అంటే ఏంటో అర్థం కాదు.. 20, 30 ఇలా వయసు పెరుగుతూ ఉంటే.. నాన్న గొప్పదనం అందరికీ అర్థం అవుతుంది. చిన్నతనంలోనే మా నాన్న మా అందరినీ వదిలి వెళ్లిపోయాడు. అందరూ గొప్ప తండ్రులు, అన్నదమ్ముల్లుగా వ్యవహరించండి. తల్లిదండ్రుల్ని కలిగి ఉన్న వారే ఈ ప్రపంచంలో అధిక ధనవంతులు. మా ‘నాన్న కుట్టి’ చిత్రం నవంబర్ 27న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
దర్శకుడు ము. మారన్ మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ సినిమాకి అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, ఫాతిమా గారికి థాంక్స్. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్‌కి థాంక్స్. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి. తండ్రీకూతుళ్ల రిలేషన్‌ని మరింత అద్భుతంగా చూపించాం. మేం మంచి కంటెంట్‌తో రాబోతోన్నా. అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రీతి అస్రాని మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. అమ్మ ప్రేమను అందరూ సెలెబ్రేట్ చేస్తారు. కానీ నాన్న ప్రేమను అంతగా సెలెబ్రేట్ చేయరు. నాన్న గొప్పదనం, త్యాగాన్ని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. ‘నాన్న కుట్టి’ మంచి సినిమాగా నిలుస్తుంది. ఇందులో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా యాక్షన్, కామెడీ ఇలా అన్నీ ఉంటాయి. అందరూ కలిసి చూసేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ ఆంటోని గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఫాతిమా గారు మంచి వ్యక్తి. నవంబర్ 27న మా సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
కిష్కింధపురి డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ .. ‘‘ఫాతిమా గారు చాలా మంచి వ్యక్తి. భార్యగా, నిర్మాతగా, వ్యక్తిగా ఆమె చాలా గ్రేట్. విజయ్ ఆంటోని గారు ప్రతీ సారి అద్భుతమైన కథల్ని అందిస్తుంటారు. రియలిస్టిక్ పాత్రలు, సినిమాలు, సంగీతంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన చేసే ప్రతీ పనిలో నిజాయితీ కనిపిస్తుంటుంది. ‘నాన్న కుట్టి’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లారా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ చిత్రంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సింగర్ మౌషిమి నేహా మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ చిత్రం ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి, ఫాతిమా గారికి థాంక్స్. కొన్నేళ్ల క్రితం మా నాన్నని కోల్పోయాను. ఇందులోని పాట వింటూ ఉంటే ఎప్పుడూ కన్నీరు వస్తూనే ఉంటుంది. ఉన్నప్పుడే తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని అన్నారు.
బాష్యశ్రీ మాట్లాడుతూ .. ‘‘నాన్న కుట్టి’ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. క్లైమాక్స్ చూసి చాలా సార్లు ఏడ్చేశాను. బేబీ లిథన్య, విజయ్ కాంబో సీన్స్ అందరినీ కదిలిస్తాయి. ఇందులో మాటలు, పాటలు రాశాను. కూతురి కోసం తాపత్రయ పడే తండ్రి, కూతురి కోసం ప్రాణాలు ఇచ్చే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోని జీవించారు. ఈ చిత్రం నా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అని అన్నారు.



