సెన్సేషనల్ హీరో ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ ఆడియో హక్కుల్ని సొంతం చేసుకున్న సరిగమ.. త్వరలోనే చిత్రం విడుదల
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ రూట్ మార్చేసి డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ సినిమాపై ట్రేడ్ సర్కిళ్లలో మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో హక్కులకు సంబంధించిన అప్డేట్ను మేకర్లు ప్రకటించారు. ‘ఈగో రాజా’ షూటింగ్ ఇటీవలె పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో టీం బిజీగా ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రాబోతోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ని సరిగమ సంస్థ భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచనున్నారు.



