శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా నుంచి నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

0
7
Poojitha Ponnada’s Birthday Special Poster as a Narthaki In Production No. 3 from Sri Aishwarya Lakshmi Movies Released
Poojitha Ponnada’s Birthday Special Poster as a Narthaki In Production No. 3 from Sri Aishwarya Lakshmi Movies Released

“ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా నుంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ చిత్రంలో నర్తకి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న పూజిత పొన్నాడ

“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో “హైవే” వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో నర్తకి క్యారెక్టర్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ రోజు పూజిత పొన్నాడ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్తకి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజభవనంలో నర్తకిమణిగా ముస్తాభైన పూజిత పొన్నాడ లుక్ ఆకట్టుకుంటోంది. నటిగా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here