వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థుల సందడి మధ్య “క్రేజీ కల్యాణం” సినిమా ‘అల సెంద్రవంక’ సాంగ్ లాంఛ్

0
3
‘Crazy Kalyanam’ ‘Ala Sendravanka’ Song Launched Amid Woxsen University Students’ Celebrations
‘Crazy Kalyanam’ ‘Ala Sendravanka’ Song Launched Amid Woxsen University Students’ Celebrations

వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థుల సందడి మధ్య “క్రేజీ కల్యాణం” సినిమా ‘అల సెంద్రవంక’ సాంగ్ లాంఛ్

ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “క్రేజీ కల్యాణం” మూవీ

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ నెల 30న “క్రేజీ కల్యాణం” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ చిత్రంలోని ‘అల సెంద్రవంక’ సాంగ్ ను హైదరాబాద్ వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థుల సందడి మధ్య లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో అఖిల్ ఉడ్డెమారి పాల్గొని తన డ్యాన్సులతో, మాటలతో భారీ సంఖ్యలో వచ్చిన విద్యార్థుల్లో జోష్ నింపారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ పాటకు స్టెప్స్ వేశారు. “క్రేజీ కల్యాణం” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా హీరో అఖిల్ చెప్పారు. ‘అల సెంద్రవంక’ పాటను సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ తో కంపోజ్ చేయగా గోరటి వెంకన్న ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి అందంగా పాడారు.

నటీనటులు – నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు

టెక్నికల్ టీమ్
——————————-
కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here