“చకోర – Lunar Love Bird” సినిమా టీమ్ అందరిలో నిజాయితీ కనిపిస్తోంది, ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ

0
3
“Chakkora – Lunar Love Bird Pre Release Event
“Chakkora – Lunar Love Bird Pre Release Event

“చకోర – Lunar Love Bird” సినిమా టీమ్ అందరిలో నిజాయితీ కనిపిస్తోంది, ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ

ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ “చకోర – Lunar Love Bird”. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ అతిథిగా విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ రుప్ప గోపీకృష్ణ మాట్లాడుతూ – ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేశాం. జస్ట్ 45 డేస్ లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. మీ అందరినీ మూవీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. అన్నారు.

హీరోయిన్ అనుష్క లూహార్ మాట్లాడుతూ – నేను హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేశాను. టాలీవుడ్ లో నటించాలనేది నా డ్రీమ్. ఈ చిత్రంతో ఆ కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. నటిగా నాకు ఈ మూవీ ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. మేమంతా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసిన ఈ సినిమాను మీ అందరూ ఇష్టపడతారు. అన్నారు.

హీరోయిన్ మలైకా టి.వాసుపల్ మాట్లాడుతూ – నేను కన్నడలో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించాను. సీరియల్స్ కూడా చేశాను. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మాలాంటి కొత్త టీమ్ ను ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన శివ నిర్వాణ గారికి థ్యాంక్స్. మీరు ఇచ్చే సపోర్ట్ మా కొత్త వాళ్లకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. “చకోర – Lunar Love Bird” ఒక క్యూట్ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని అందంగా రూపొందించేందుకు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, మా టీమ్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మా సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

యాక్టర్ సుమన్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మా టీమ్ కు మంచి గుర్తింపు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఈ నెల 9న థియేటర్స్ లో మా “చకోర – Lunar Love Bird” సినిమా చూడండి. అన్నారు.

ప్రొడ్యూసర్ డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ – ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ గారికి థ్యాంక్స్. “చకోర – Lunar Love Bird” మూవీ మా టీమ్ అందరి కల. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇదొక భిన్నమైన ప్రేమ కథ. ఈ సినిమా చూసి మీరు అందించే ప్రశంసలు, కొట్టే చప్పట్లే మాకు కోట్లాది రూపాయల ఆస్తిగా భావిస్తాం. జీవితంలో చకోర పక్షిని ఆదర్శంగా తీసుకోండి. మీరు అనుకున్నవి పట్టుదలగా సాధించండి. ఈ నెల 9న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో శ్రవణ్ మాట్లాడుతూ – హీరో కావాలనే నా కలను ప్రోత్సహించిన మా పేరెంట్స్ కు, ఈ చిత్రంలో అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. శివ నిర్వాణ గారి సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ఆయన మా ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. “చకోర – Lunar Love Bird” సినిమాలో స్నేహితుల మధ్య బంధాన్ని, తల్లి కొడుకు మధ్య బంధాన్ని, ప్రేమ జంటలోని అనుబంధాన్ని చూస్తారు. ట్రైలర్ లో మీరు చూసినదానికంటే సినిమాలో ఇంకా ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 9వ తేదీన థియేటర్స్ కు రండి ట్రైలర్ లో మీకు చూపించకుండా దాచిన ట్విస్ట్స్ మా మూవీలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ – “చకోర – Lunar Love Bird” ఇదొక అమ్మ చెప్పిన ప్రేమ కథ. ఒక అబ్బాయి ప్రేమ కథ. ఒక అందమైన ప్రేమ కథ. చకోర ఒక విశిష్టమైన పక్షి. దాహం వేస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకుండా వర్షపు నీళ్లతోనే దాహం తీర్చుకుంటుంది. మనం కూడా జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసమే వేచి చూడాలనేది మా సినిమాలో చెబుతున్నాం. చకోర పక్షికి జాబిల్లిని చేరాలని కోరిక. దాన్ని చేరేందుకు అలుపెరుగకుండా ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో మరణిస్తుంది గానీ ప్రయత్నం ఆపదు. మనం కూడా చకోర పక్షిలా మన లక్ష్యాన్ని చేరుకునేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించాలి. ఇదే చకోర పక్షి మనకు నేర్పించే పాఠం. మా సినిమాకు ప్రివ్యూస్ వేశాం. చూసిన వాళ్లు జెన్ జీ ప్రేమ కథ అని, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు క్లాసికల్ కమర్షియల్ సినిమా అంటున్నారు. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్యూటిఫుల్ ఫస్టాఫ్, వండర్ ఫుల్ సెకండాఫ్ అంటున్నారు. థియేటర్స్ లో ఈ నెల 9న ప్రేక్షకులు అందించే విజయం కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.

అతిథిగా వచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – వైజాగ్ కు వచ్చిన ప్రతిసారీ మన ఊరి అబ్బాయి అంటూ మీరు చూపించే ప్రేమ నాకెప్పుడూ ప్రత్యేకమే. అయితే నా సినిమాల్లో ఏ ఫంక్షన్ ఇక్కడ జరగలేదు. ఇరుముడి సక్సెస్ తర్వాత ఈ రోజు “చకోర – Lunar Love Bird” ఈవెంట్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. చొక్కాకుల వెంకట్రావు గారు మాకు బంధువు. ఆయన తన స్నేహితుడు ప్రొడ్యూసర్ హేమారావు కోసం నన్ను ఈవెంట్ కు పిలిచారు. ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరిలో నిజాయితీగా పనిచేశాం అనే ఫీల్ కనిపిస్తోంది. మన వైజాగ్ నుంచి పూరి గారు పరశురామ్, నేను ఇలా చాలా మంది దర్శకులం అయ్యాం. ఇప్పుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. మీలో ఉన్న టాలెంట్ ను గుర్తించండి మీరు కూడా మరో పూరి, శివ నిర్వాణ కాగలరు. ఈ మూవీలో వర్క్ చేసిన యాక్టర్స్ అంతా ప్రామిసింగ్ గా ఉన్నారు. మ్యూజిక్, డీవోపీ..ఇలా టెక్నీషియన్స్ అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. “చకోర – Lunar Love Bird” సినిమాకు సూపర్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు

టెక్నీషియన్స్
————-
లొకేషన్స్ & ప్రమోషనల్ ఆఫీసర్ : సనపల చిన్నబాబు
క్యాషియర్ : హరీష్
లైన్ ప్రొడ్యూసర్: కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ
ఎస్ఎఫ్ఎక్స్ : రఘునాధ్ కేమిశెట్టి
వీఎఫ్ఎక్స్ : చందు ఆది
డీటీఎస్ సౌండ్ ఇంజనీర్ : రాధాకృష్ణ
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here