‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి

0
7
‘The Red Bag’ Producer Harikrishna Somisetty
‘The Red Bag’ Producer Harikrishna Somisetty

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీని రవి కుమార్ సీరపు తెరకెక్కించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఆగస్ట్ 21న భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో

నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ .. ‘మా ‘రెడ్ బ్యాగ్’ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్‌కి మంచి ఆదరణ దక్కింది. గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. మా కంటెంట్‌కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. మా సినిమా చాలా స్టైలీష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అంతా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ట్విస్ట్‌ల్ని ఎవ్వరూ గెస్ చేయలేరు.

చివరి వరకు ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం.యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నికల్ టీం అంతా కూడా మాకు సహకరించారు. ఇక ఆగస్ట్ 21న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం. మాకు విడుదల విషయంలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారు అద్భుతంగా సపోర్ట్ ఇస్తున్నారు. వారి సహకారంతోనే ఎక్కువ స్క్రీన్‌లలో మూవీని రిలీజ్ చేయగల్గుతున్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here