శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’

0
8
Dharani I Love You In Post Production
Dharani I Love You In Post Production

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’

▪️ అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి
▪️ త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్

హైదరాబాద్: హెచ్‌ఎస్‌పీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రాజమౌళి, పరుచూరి మురళి, దేవిప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి మొదటగా ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’ షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బొమ్మరాశిపేట, ఎల్లగూడ, ఉద్దమర్రి, లాల్గాడిమలక్‌పేట్, శామీర్‌పేట్, తూప్రాన్, వెంకటరత్నాపురం తదితర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణను పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Dharani I Love You In Post Production
Dharani I Love You In Post Production

ఆసక్తికరమైన కథనం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ‘ధరణి ఐ లవ్ యూ’ను మంచి కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు.. ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ ఒక సెంటిమెంట్ సాంగ్ పాడటం జరిగింది..త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రంలో వంశీ ఆకుల హీరోగా, మహిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్పితా లోహి, ఆమని, వినోద్ కుమార్, మధుసూదన్, సత్య ప్రకాష్, దేవీ ప్రసాద్, అశోక్ కుమార్, బలగం సంజయ్, చిత్రం శ్రీను, షేకింగ్ శేషు, చిట్టిబాబు, రాజశేఖర్ మద్దికుంట, బాలసూర్య, పార్వతి, శకుంతలమ్మ, స్మృతి పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటుండటంతో సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.

చిత్ర బృందం-
సమర్పణ: శ్రీమతి బాలామణి
నిర్మాత: రాజశేఖర్ మద్దికుంట
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయికృష్ణ కె.వి.
మాటలు: కామన వి.సాయి, బాలసూర్య
పాటలు: ఉమా వంగూరి, చాందిని, ప్రసాద్ సానా, విశ్వనాధ్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
ఎడిటింగ్: నందమూరి హరి, ఎన్.టి.ఆర్.
సినిమాటోగ్రఫీ: చిన్నయోగి అన్నెం
ఆర్ట్: జగన్.బి
ఫైట్స్: దేవరాజ్, నందు, జీవన్
కొరియోగ్రఫీ: చంద్రకిరణ్
కాస్ట్యూమ్స్: లోకేష్
మేకప్: రాఘవ
స్టిల్స్: కృష్ణ, శ్రీను
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: బ్రహ్మజీ, నారాయణ, వెంకటేష్, శ్రీను, మహిపాల్
పబ్లిసిటీ: నవీన్ నంద్యాల
పీఆర్ఓ : కడలి రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here