ఈ నెల 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న”పహల్గాం లవ్ స్టోరీ”

0
5
Pahalgam Lovestory
Pahalgam Lovestory

ఈ నెల 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ప్రముఖ దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు “పహల్గాం లవ్ స్టోరీ” సినిమా

తెలుగు తెరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు కొంత విరామం తర్వాత రూపొందించిన పాన్ ఇండియా సినిమా “పహల్గాం లవ్ స్టోరీ”. ఈ సినిమాను గాయత్రి కళా చిత్ర బ్యానర్ పై పి.ఎన్. రామచంద్రరావు నిర్మించి దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ మోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్స్ గా నటించారు. సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది. జమ్ము కాశ్మీర్ లోని బ్యూటిఫుల్, అరుదైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. మనసుకు హత్తుకునే రొమాంటిక్ లవ్ స్టోరీని చూపిస్తూనే దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలను మేళవించి ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్ లో ఎక్సిపీరియన్స్ చేయబోతున్నారు. “పహల్గాం లవ్ స్టోరీ” కేవలం వినోదం కోసం రూపొందించిన సినిమా మాత్రమే కాదు, మనందరిలో దేశభక్తిని మేల్కొలిపే ఒక జాతీయ సమస్యను ఈ సినిమాలో చూపిస్తున్నాం అని చెబుతున్నారు దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు.

నటీనటులు – కృష్ణమోహన్, చిత్రశుక్ల, సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ, తదితరులు

టెక్నీషియన్స్
———————
బ్యానర్ – గాయత్రి కళా చిత్ర
దర్సక నిర్మాత – పి.ఎన్. రామచంద్రరావు
పీఆర్ఓ – మూర్తి మల్లాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here