‘VISA – వింటారా సరదాగా’ రెండో టీజర్ విడుదల

0
8
VISA - VINTARA SARADAGA TEASER 2 OUT NOW
VISA - VINTARA SARADAGA TEASER 2 OUT NOW

‘VISA – వింటారా సరదాగా’ రెండో టీజర్ విడుదల

అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.

ఉద్భవ్ రఘు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ఈ క్విర్కీ క్యాంపస్ టు USA రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ ఎస్. మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ రెండో టీజర్‌ను పూర్తిగా కథానాయకుడి కోణంలో రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితంలో ఎదురయ్యే ‘ట్రబుల్’ గురించి అశోక్ గల్లా పాత్ర తనదైన శైలిలో చెప్పే మాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సహజమైన సంభాషణలు, చురుకైన హాస్యం, మనసును హత్తుకునే  ఎమోషన్స్‌తో సాగిన ఈ మోనోలాగ్ టీజర్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

అయితే ఈ టీజర్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ఆసక్తికరమైన అంశం ‘ఖలేజా’ చిత్రంలోని ఐకానిక్ డైలాగ్‌కు సంబంధించిన రిఫరెన్స్. ఊహించని విధంగా వచ్చిన ఈ రిఫరెన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం టీజర్‌లోని ఎనర్జీకి మరింత బలాన్ని చేకూర్చింది. వినోదం, ప్రేమ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ‘VISA – వింటారా సరదాగా’ రెండో టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్
దర్శకత్వం: ఉద్భవ్ రఘు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సంగీతం: విజయ్ బుల్గానిన్
విడుదల: అక్టోబర్ 17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here