‘ఇరుముడి’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది: గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ
-మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఎమోషన్స్ రోలర్ కోస్టర్ ట్రైలర్ లాంచ్
మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.
ట్రైలర్‌తో సినిమా కథలోని ప్రధాన అంశంపై స్పష్టత వచ్చింది. రవితేజ ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించారు. భార్య, కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి. తన కుటుంబానికే కాదు.. ఊరిలోని ప్రతి అమ్మాయిని కూడా తన కూతురిలాగే భావిస్తాడు. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆయనలోని రక్షణ భావం కోపంగా మారుతుంది.
ఈ పాత్రకు మరో కోణం ఉంది. రవితేజ పాత్రకు మద్యపానం అలవాటు ఉంటుంది. అదే సమయంలో ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటాడు. మాల ధరించిన సమయంలో పూర్తిగా ప్రశాంతమైన, భిన్నమైన వ్యక్తిగా మారతాడు. ఇలాంటి విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జీవితంలోకి వరుసగా అమ్మాయిల హత్యలు రావడంతో.. అసలు ఆ హత్యలకు కారణం ఎవరు? వాటిని అతను ఎలా అడ్డుకున్నాడు? అనేదే కథలో కీలకంగా కనిపిస్తోంది.
శివ నిర్వాణ తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కలిపినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా రవితేజ కూతురు.. తన తండ్రి కోపాన్ని చూసి తాను కూడా భయపడుతున్నానని చెప్పే సన్నివేశం పాత్రలోని ఎమోషనల్ కాంప్లెక్సిటీని చూపిస్తుంది. కుటుంబ బంధాలను బలంగా ఎలివేట్ చేయడంలో శివ నిర్వాణ స్టయిల్ ఈ ట్రైలర్‌లో కనిపించింది.
రవితేజ ప్రతి ఫ్రేమ్‌లో తనదైన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ఒకవైపు కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే వ్యక్తిగా, మరోవైపు అన్యాయం ఎదురైతే విరుచుకుపడే వ్యక్తిగా ఆయన పాత్ర ఆసక్తిని పెంచుతోంది. మద్యపాన అలవాటు, అయ్యప్ప మాల ధరించినప్పుడు వచ్చే ప్రశాంతత.. ఈ రెండు విభిన్న కోణాలు పాత్రకు మరింత ఆసక్తిని తీసుకొచ్చాయి.
ప్రియా భవానీ శంకర్ రవితేజ భార్య పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రశాంతమైన కుటుంబ జీవితం కోసం తపించే భార్య పాత్రలో ఆమె సహజంగా కనిపించారు. బేబీ నక్షత్ర తండ్రి-కూతురు బంధంలో మంచి ఎమోషన్ తీసుకొచ్చింది. గురుస్వామి పాత్రలో సాయికుమార్ ఆకట్టుకోగా.. స్వాసిక నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించారు.
నిర్మాణ విలువల్లో ‘ఇరుముడి’ గ్రాండ్‌గా కనిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. చివర్లో వినిపించిన ‘మల్లెపూల పల్లకి’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచి గూస్‌బంప్స్ తెప్పించింది. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా సినిమాకు బలం చేకూర్చాయి.
మొత్తంగా చూస్తే ‘ఇరుముడి’ ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సరైన మోతాదులో చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుభూతిని అందించబోతుంది.
https://www.youtube.com/watch?v=CSXhb2zhfLc
భీమవరంలో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ: “హలో భీమవరం. నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్‌ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. మాది భీమవరం అని ఎవరైనా సరే గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం. మీతో పాటు ట్రైలర్ నేను కూడా ఈరోజే చూశాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. థాంక్యూ భీమవరం.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. వభీమవరంలో ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ఈ ట్రైలర్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ అంటే ఇద్దరికి పడిన ముడి. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి.. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు చిక్కుముడులను కలిపి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూడు అంశాలను ఒక ఫ్యామిలీ డ్రామాలో కలిపి తీసుకురావడం ద్వారా సినిమా ఇచ్చే ఇంటెన్సిటీ మిమ్మల్ని అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. విజయ్ ఈ సినిమా ట్రైలర్‌ను చాలా అద్భుతంగా కట్ చేశాడు. రవితేజ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. మిగతా వాళ్లందరి గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు.. ఇది ఒక గొప్ప ఎమోషన్.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ: రవితేజ నా కజిన్. స్టార్ అవ్వాలని సంకల్పంతో ఎవరి సహాయం లేకుండా తన కష్టంతో పైకి వచ్చిన రియల్ హీరో మా రవితేజ. మా జిల్లా వ్యక్తి మాస్ మహారాజా అవ్వడం, తను ఈ వేడుకకు రావడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నిజంగా చాలా మెమొరబుల్ మూమెంట్. నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మన జిల్లా గొప్పతనం ఏంటంటే కృష్ణంరాజు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంతోమంది అద్భుతమైన హీరోలుగా రాణించారు. మైత్రీ మూవీ మేకర్స్ నాకు ఎంతో ఆప్తులు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇరుముడి రవితేజ గారికి మరో పెద్ద హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.”
ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ థాంక్యూ. ఈ సినిమా మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాకు కావేరి పాత్ర ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు. నక్షత్ర చాలా టాలెంటెడ్. కచ్చితంగా తన పెర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా నిర్మాతలు రవి గారు, నవీన్ గారు చాలా గ్రాండ్‌గా నిర్మించారు. రవితేజ గారితో సినిమాలో పనిచేయడం నాకు చాలా స్పెషల్. ఆయన్ని చాలా దగ్గరగా చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కచ్చితంగా ఇది రవితేజ గారికి మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుంది. అలాంటి సినిమాలో నేను హీరోయిన్‌గా ఉండటం నాకు ఇంకా స్పెషల్.
నిశాంత్ మాట్లాడుతూ: “మా కాలేజ్ తరఫున హీరో రవితేజ గారికి, డైరెక్టర్ గారికి, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్టు 21న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
బేబీ నక్షత్ర మాట్లాడుతూ: “ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు శివ నిర్వాణ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రియా గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా నమస్కారం. భీమవరంలో ఈవెంట్ చేద్దామని అనుకున్నప్పుడు రవితేజ గారు వెంటనే ఓకే అన్నారు. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడు యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, ఎమోషన్.. ఏదైనా అద్భుతంగా పలికించగల రవితేజ గారే దీనికి కరెక్ట్ అని అనుకున్నాం. ఆయన కథ వినగానే ఓకే చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. ప్రియా భవానీ శంకర్ మిడిల్ క్లాస్ వైఫ్‌గా అద్భుతంగా నటించారు. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ఇది చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని నమ్ముతున్నాం. ప్రభాస్ గారి ‘ఫౌజీ’ షూటింగ్ కూడా అద్భుతంగా జరుగుతోంది. ప్రభాస్ గారు ఇరుముడి టీంకి ఆల్ తే బెస్ట్ చెప్పారు. ఆగస్టు 21న అందరూ థియేటర్లలో ‘ఇరుముడి’ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో



