చిన్నప్పటినుండి కలలు కనేదాన్ని– హీరోయిన్‌ చమిందా వర్మ

0
5
Hreem Movie Team Celebrates Heroine Chaminda Varma Birthday
Hreem Movie Team Celebrates Heroine Chaminda Varma Birthday

చిన్నప్పటినుండి కలలు కనేదాన్ని– హీరోయిన్‌ చమిందా వర్మ….

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి రావాలని చిన్నప్పటి నుండి కలలు కనేదాన్ని. అమ్మా నాన్నలు ఎంతో ఎంకరేజ్‌ చేసేవారు కానీ డాక్టర్‌ పూర్తయిన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని వారిద్దరూ పట్టు పట్టడంతో యంబిబిఎస్‌ పూర్తి చేశాను. దుబాయ్‌లోనే పుట్టి పెరగటంతో నా విధ్యాభ్యాసం అంతా దుబాయ్‌లోనే పూర్తయింది. డాక్టర్‌గా కూడా ప్రాక్టీస్‌ చేస్తూ అందరితో మంచి మార్కులు పడే సమయంలో సినిమా అవకాశం రావటంతో ఎగిరి గంతేసి ఇండియాకి వచ్చాను. డాన్స్‌ కూడా నేర్చుకోవటంతో నటన మీద కూడా కొంత అవగాహన ఏర్పడింది . భారతదేశం వచ్చి రావటంతోనే ‘హ్రీం’ సినిమాలో హీరోయిన్‌గా నటించే చక్కని అవకాశం దక్కింది. నటిగా నన్ను నేను నిరూపించుకోవటానికి ఇదొక చక్కని అవకాశం. తొలి సినిమాలోనే మూడు రకాలైన వేరియేషన్స్‌ ఉండే పాత్ర దక్కటంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత మీ అందరూ చూసి చెప్పాలి నా నటన గురించి. ‘హ్రీం’ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత దాదాపు 15 యాడ్‌ ఫిలింస్‌లో నటించాను. ఒక నటిగా అవన్నీ నాకెంతో తృప్తినిచ్చాయి. నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా ధన్యావాదాలు తెలుపుతున్నాను అన్నారు బర్త్‌ డే గాళ్‌ చమిందా వర్మ….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here