“రోమాంచకం” మూవీ నుంచి హీరో సుమంత్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

0
2
Sumanth Prabhas Romanchakam Birthday Still
Sumanth Prabhas Romanchakam Birthday Still

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ నుంచి హీరో సుమంత్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

-సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన “రోమాంచకం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు యంగ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “రోమాంచకం” సినిమా నుంచి ఆయన బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది సుమంత్ ప్రభాస్ కు సక్సెస్ ను అందించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. “రోమాంచకం” సినిమా సుమంత్ ప్రభాస్ కు మంచి ల్యాండ్ మార్క్ మూవీ కాబోతోందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు వస్తోంది. “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————–
డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here