జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూలై 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా
కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘నందు ముందుగా శ్రీరామపురంలో జరిగే కథ అని చెప్పారు. నాన్న గారు శ్రీరామపురంలో అనే ఊర్లోనే పుట్టారు. నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి.. యుద్దాలు జరిగాయి.. ‘లెనిన్’లోనూ ఓ ప్రేమ కథ ఉంది. భారతి (భాగ్యశ్రీ బోర్సె) కోసం ఎన్ని యుద్ధాలైన చేయొచ్చు. భారతికి ఈ సినిమాకి హార్ట్ బీట్‌లాంటిది. శివాజీ, బ్రహ్మాజీ ఈ చిత్రంలో పాత్రలను పోషించడం ఆనందంగా ఉంది. సునీల్‌తో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. ‘లెనిన్’ మీద ప్రేమతో వీరంతా చాలా కష్టపడ్డారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవీన్ ఎడిటింగ్, బ్రిట్టో కెమెరావర్క్ అద్భుతంగా ఉంటుంది. చింటు అన్న(నాగవంశీ)కి మాస్ పల్స్ గురించి తెలుసు (నవ్వుతూ). చింటుకి ఈ మూవీ ఉన్న నమ్మకంతో ఏపీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘లెనిన్’ ఈ సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ, సీమలో జరుగుతున్న మహా భారతం. అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు. లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు. మనందరికీ ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి.. ఈ ప్రేక్షక దేవుళ్లు సాక్షిగా చెబుతున్నాను.. జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు’ అని అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘లెనిన్’తో నేను మీ (అభిమానులు) ఇంటిలో ఒకడిని అవ్వాలని ప్రయత్నం చేశాను. సీమ బిడ్డ నందు నాకు అద్భుతమైన కథ చెప్పారు. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించింది. అందుకే నేను వెంటనే ఓకే చెప్పాను. వంశీ ఒక్కడే ఈ మూవీని చేయాలని అనుకున్నాడు. కానీ కథ విన్నాక ఇద్దరికీ ఓ పాజిటివ్ వైబ్ వచ్చి నాన్న గారికి చెప్పాం. అందరం కలిసి పని చేద్దామని నిర్ణయించుకున్నాం. లియోన్, నవీన్, తమన్ ఇలా అందరూ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. భారతిగా భాగ్యశ్రీ బోర్సె చాలా కష్టపడ్డారు. బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, శివాజీ గారు ఇలా మేమంతా కలిసి ఓ కుటుంబంలా సినిమా కోసం కష్టపడ్డాం. నేను ‘లెనిన్’ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడను. జూలై 10న సినిమానే మాట్లాడుతుంది. ఆడియెన్స్ నుంచి రియాక్షన్స్ వచ్చిన తరువాతే నేను మూవీ గురించి మాట్లాడతాను’ అని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. నేనే అఖిల్‌ను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ‘లెనిన్’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. అఖిల్ ఈ సారి ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చడు. ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు మాత్రం ఖంగుతినేలా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లా మాత్రం అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. భాగ్య శ్రీ గారు మాకెంతో సపోర్ట్ చేశారు. శివాజీ గారు, సునీల్ గారు అద్భుతంగా నటించారు. నేను, తమన్ కలిసి వచ్చిన ప్రతీ సారి బ్లాక్ బస్టర్ వస్తుంది. మా కాంబోలో అసలు అపజయం అన్నదే లేదు. నాగార్జున గారు.. మనం హిట్టు కొట్టిన తర్వాత మాట్లాడదాం’ అని అన్నారు.
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ .. ‘‘లెనిన్’లో నేను భారతి అనే పాత్రను పోషించాను. ఇలాంటి గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నా కెరీర్‌లో భారతి అనే పాత్ర నిలిచిపోతుంది. నాగార్జున గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఈ మూవీ కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. ఓ టీంగా పని చేద్దామని అఖిల్ ఎంతో సపోర్ట్ చేశారు. అన్నపూర్ణ, సితార బ్యానర్లు కలిసి చేసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు శివాజీ మాట్లాడుతూ .. ‘అన్నపూర్ణ బ్యానర్, నాగార్జున గారి వల్లే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. ‘లెనిన్’ నా హార్ట్‌కి దగ్గరైన చిత్రం. మేం ఇప్పుడు ఎక్కువగా మాట్లాడం. రిలీజ్ అయ్యాక సినిమానే మాట్లాడుతుంది. మూవీలో మేం ఎక్కడా కనిపించం.. కేవలం పాత్రలే కనిపిస్తాయి. కొడుకు సక్సెస్ కోసం నాగార్జున గారు ‘లెనిన్’ కోసం చాలా కష్టపడ్డారు. అఖిల్‌కి ఇది పర్ ఫెక్ట్ మూవీ. అభిమానులకి ఏం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. జూలై 10న బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. జూ. కింగ్ రాబోతోన్నాడు’ అని అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ .. ‘అక్కినేని ఫ్యామిలీలో అందరితో నటించాను. నెక్ట్స్ జనరేషన్ కిడ్‌తోనూ నటించాలని వెయిట్ చేస్తున్నాను. ఇందులో మేం కనిపించకుండా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అఖిల్ ఓ కొత్త పాత్రను అద్భుతంగా పోషించారు. అఖిల్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. నాకు ఇష్టమైన సితార, అన్నపూర్ణ బ్యానర్ల నుంచి వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ .. ‘‘అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. అఖిల్‌కి ఉన్నంత ఎనర్జీ మాకు ఉండదు. ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. చిత్తూరు బ్యాక్ డ్రాప్‌ని, ఆ వాతావరణాన్ని నందు తెరపైకి తీసుకు వచ్చారు. ఈ మూవీతో నాగార్జున గారికి, నాగవంశీ గారికి మంచి విజయం దక్కాలని ఆ వెంకటేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాత : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
బ్యానర్లు : మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ :నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ :లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ :అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :ఆనంద్ రెడ్డి కర్నాటి
పోస్ట్ ప్రొడక్షన్ : అన్నపూర్ణ స్టూడియోస్
కలరిస్ట్: వివేక్ ఆనంద్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పి.ఆర్.ఒ : వంశీ కాకా



