ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

0
62
AP FDC Director Samudra
AP FDC Director Samudra

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని ఆయన తెలిపారు.

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఏపీ ప్రభుత్వం స్థలాలు ఇచ్చారని, డబ్బులు తీసుకుంటున్నారని కొందరు మిత్రులు తనకు ఫోనులు చేసి ఎంక్వయిరీ చేయడం వల్ల అందరికీ వివరణ ఇవ్వటం కోసం ఈ ప్రకటన ఇస్తున్నానని సముద్ర తెలిపారు.

కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి కమిటీ చాలా అద్భుతంగా ఉందని, చిత్రసీమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను, దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. అటువంటి కార్యక్రమాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేసినా… తన పేరు చెప్పినా, వాడినా ఊరుకోనని సముద్ర హెచ్చరించారు.

ఏపీ ఎఫ్.డి.సి సంస్థకి సంబంధించిన ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఏపీలో చిత్రసీమ అభివృద్ధికి ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్ గా తన వంతు కృషి చేస్తానని సముద్ర తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here