‘డెకాయిట్‌’తో మరో సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ: ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్

0
47
Dacoit Post Release PressMeet
Dacoit Post Release PressMeet
‘డెకాయిట్‌’తో మరో సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ: ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్  లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో  విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హైదరాబాద్ లో ప్రేక్షకులతో కలసి ఈ చిత్రాన్ని వీక్షించిన చిత్ర యూనిట్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ప్రెస్ మీట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్.  మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను మనసుపెట్టి చేశాము. మీరు కూడా మనసుతో చూసి ఆదరించారు. థాంక్యూ సో మచ్. డెకాయిట్‌ లో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో(నవ్వుతూ). షానియల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాలా ఎమోషనల్‌గా ఉన్నాను. ఇక్కడి నుంచి మీ అందరికీ ప్రేమ పంచడానికి చాలా నగరాలు తిరుగుతాము. మరో సక్సెస్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. ప్రేమతో ఈ సినిమా చేశాము. మీరు కూడా ప్రేమతో చూశారు. థాంక్యూ. లవ్ యు.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ..ఐ లవ్ యు ఆల్. థాంక్యూ. సినిమా మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా దర్శకుడు శానిల్‌కు ఇది తొలి సినిమా. మీరందరూ ఎంతో గొప్పగా స్వాగతం పలకడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

దర్శకుడు షానియల్ డియో మాట్లాడుతూ..అందరికీ థాంక్యూ. సినిమాపై ఇంత గొప్ప ప్రేమ, ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here