“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

0
35
“King Buddha – We Want World Peace” Title Song Launch by Sri Lankan Minister Dr. Sunil Senevi
“King Buddha – We Want World Peace” Title Song Launch by Sri Lankan Minister Dr. Sunil Senevi

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

హైదరాబాద్ ఐటిసి కాకతీయలో జరిగిన ఫంక్షన్ లో శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్ అనే టైటిల్ సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇరాన్ – ఇజ్రాయిల్, ఉక్రెయిన్ – రష్యాతో పాటు 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని “కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్” సత్యారెడ్డి చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రారంభించి థాయిలాండ్, మలేషియా, వియత్నం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా లాంటి బుద్దిస్ట్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు. త్వరలో తమ శ్రీలంక దేశంలో షూటింగ్ జరుపుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా కింగ్ బుద్ధ నిలిచిపోతుందని ఆయన అన్నారు. అన్ని బౌద్ధ దేశాల సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తారని ఆయన ఆశించారు. అనుబాంబు దాడులకు గురైన హీరోషిమా – నాగసాకి ఇప్పటికీ కోలుకోలేదని ఆయన గుర్తు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలన్న, ప్రపంచం శాంతి మార్గంలో నడవాలన్నా ప్రపంచానికి బుద్ధిజమే ఏకైక మార్గం అని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది బౌద్ధ బిక్షువులు పీస్ వాక్ చేస్తున్నారని కోట్లాదిమంది ప్రజలు వారిని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. కింగ్ బుద్ధ హాలీవుడ్ మూవీలో చిత్రీకరించిన సీన్లు కొన్ని తను చూసానని, దర్శకుడు సత్యారెడ్డి అద్భుతంగా చిత్రీకరించాడని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సునీల్ శనివిని కింగ్ బుద్ధ హాలీవుడ్ చిత్ర యూనిట్ పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కింగ్ బుద్ధ చిత్ర దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ… “30 సంవత్సరాల తన సినీ జీవితంలో కింగ్ బుద్ధ చిత్రం ద్వారా గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచానికి అందించటంతో తన జన్మ ధన్యమవుతుందని ఆయన అన్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు రాని అత్యుత్తమ సాంకేతికను చిత్రానికి వాడుతున్నామని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగులోని గౌతమ బుద్ధుని జననం, బాల్యం విద్యాభ్యాసానికి సంబంధించిన సన్నివేశాలు నేపాల్ దేశంలోని హిమాలయాలు, లుంబిని, ఘాట్మండు ప్రాంతంలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విబూత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here