సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్” నుంచి డా. పూర్వజ్ గా హీరో, డైరెక్టర్ పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0
44
Hero Director Poorvaaj From Killer
Hero Director Poorvaaj From Killer

సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్” నుంచి డా. పూర్వజ్ గా హీరో, డైరెక్టర్ పూర్వాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు హైదరాబాద్ లో “కిల్లర్” సినిమా నుంచి హీరో, డైరెక్టర్ పూర్వాజ్ నటిస్తున్న డా.పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. దర్శకుడిగా ఒక డిఫరెంట్ సై ఫై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తూనే మరోవైపు మూవీలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు పూర్వాజ్. ఆయన దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్
—————-
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here