అర్జున్ ‘సీతా పయనం’ నుంచి ఎనర్జిటిక్, మాస్ సాంగ్ ‘బసవన్న’ విడుదల

0
60
Dhruva Sarja As Basavanna In Seetha Payanam
Dhruva Sarja As Basavanna In Seetha Payanam

అర్జున్ ‘సీతా పయనం’ నుంచి ఎనర్జిటిక్, మాస్ సాంగ్ ‘బసవన్న’ విడుదల

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు.

అయితే యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ‘బసవన్న’ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో బసవన్నగా ధ్రువ సర్జా అద్భుతమైన పాత్రలో కనిపించబోతోన్నట్టుగా ఈ పాటను చూస్తే అర్థం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో ‘బసవన్న’ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ పాటలో చూపించారు. కాసర్ల శ్యాం లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండగా.. నకాస్ అజిజ్, ఎల్. కీర్తన గాత్రం శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటకు లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ మూవీకి ధ్రువ సర్జా మెయిన్ అస్సెట్‌గా మారబోతోన్నాడని ఈ పాట స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల బృందం పని చేసింది. జి బాలమురుగన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.

నటీనటులు : నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
స్టోరీ – స్క్రీన్ ప్లే – ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్
డైలాగ్స్: Dr. సాయి మాధవ్ బుర్ర
మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: G. బాల మురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ
ఫైట్స్ : కిక్ యాస్ కాళీ
కో-డైరెక్టర్: UL. మూర్తి
PRO: సాయి సతీష్
డిజిటల్ మార్కెటింగ్: స్టార్ సర్కిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here