‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. రవితేజ గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది – హీరోయిన్ డింపుల్ హయతి

0
74
Ashika Ranganath During Her Media Interaction About Bhartha Mahasayulaku Wignyapthi

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. రవితేజ గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది – హీరోయిన్ డింపుల్ హయతి

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్,  పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

డింపుల్ హయతి మాట్లాడుతూ…డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈ కథ చెప్పాగానే నచ్చింది. ఈ కథ వినగానే ఇందులో వైఫ్ క్యారెక్టర్ బాలామణి పాత్ర చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే రవితేజ గారి సినిమాలో ఒక మోడరన్ అమ్మాయి పాత్ర చేశాను. బాలామణి పాత్ర అయితే నాకు కొత్తగా వుంటుందనిపించింది. డైరెక్టర్ గారు కూడా బాలామణి పాత్ర కోసమే అనుకోవడం ఆనందంగా అనిపించింది.

-కథ చెప్పిన తర్వాత ఇందులో హీరో రవితేజ అని చెప్పడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. రవితేజ గారితో ఇది నా రెండో సినిమా. ఆయన వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది.

-ఇందులో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. డైరెక్టర్ కిషోర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బాలామణి పాత్రలో కనిపించడం కొత్త ఎక్స్ పీరియన్స్.

-కాస్ట్యుమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. క్యారెక్టర్ కి తగ్గట్టు కలర్స్ ఎంచుకోవడం జరిగింది. అలాగే పాటల్లో మంచి కలర్ ఫుల్ కాస్ట్యుమ్స్ కనిపిస్తాయి. విజువల్స్ అన్నీ వైబ్రెంట్ గా వుంటాయి. అమ్మాయిలందరూ రిలేట్ అవుతారు.

– ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ వుంది. అది మీరు సినిమాలోనే చూడాలి. డైరెక్టర్ గారు ప్రతిది నటించి చూపిస్తారు. ఆయన డైలాగ్స్ కూడా చాలా యునిక్ గా వుంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ చాలా సెన్సిబుల్ గా వుంటుంది.

-ఇందులో డ్యాన్స్ నెంబర్స్ కూడా అందరూ మాట్లాడుడుతున్నారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మా ఇద్దరి పర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా వుంటుంది.

-ఈ మూవీ జర్నీలో నేను ఆషిక చాలా మంచి ఫ్రండ్స్ అయ్యాం. మా మధ్య మంచి బాండింగ్ వుంది.  

– నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి చెన్నై లో గ్రాండ్ పేరెంట్స్ తో కలసి సెలబ్రేట్ చేసుకుంటాను.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here