నమస్కారం సర్ / మేడమ్
నేను ( అశోక్ దయ్యాల ) సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబర్ గా(ఈసీ) ,బ్యాలెట్ సీరియల్ నెంబర్ :4 పోటీచేస్తున్నాను..ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ మేసేజ్ పెడుతున్నాను.దయచేసి చదవగలరు..
నేను ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యాలనుకున్నప్పుడు నాకు మద్దతుగా బలమైన ప్యానెల్ ఉండాలని అనుకున్నాను..ఆ దిశగా ప్రయత్నం చేశాను..యునైటెడ్ ప్యానెల్ లో అవకాశం దక్కింది…ఆ అవకాశం రావడానికి ముఖ్య కారణం మీరు ( సినిమా జర్నలిస్ట్ లు )
ఓ ప్యానెల్ లో అవకాశం దక్కితే చర్చించుకోవాలా…టైమ్ వేస్ట్ అని మీకు అనిపించవచ్చు…కానీ చెప్పాలి…అది నా బాధ్యత.. హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ ప్రచారం .రాజకీయ పార్టీల ప్రచారం తలదన్నెలా చేస్తున్న విషయం సోషల్ మీడియాలో మీరు గమనిస్తున్నారు…
ప్యానెల్స్ వెనుక బలమైన జర్నలిస్ట్ సంఘాలు , యూనియన్స్ ఉంటాయి… ఇది నిజం. దాని ద్వారా విజయాలు సోంతం చేసుకోవచ్చని ప్రతి ఒక్కరి ప్రయత్నం.. అందరిలాగే నేను యునైటెడ్ ప్యానెల్ వారిని సంప్రదించాను..నాకు మాదిరిగానే.. జర్నలిజం వృత్తిలో కోనసాగుతున్న సీనియర్ జర్నలిస్ట్ లు ( ఉద్దండులు , 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ) ప్యానెల్ లో అవకాశం కోసం ప్రయత్నం చేశారు.. కానీ నాకు మాత్రమే అవకాశం దక్కింది… సీనియర్స్ ని కాదని నాకు అవకాశం ఇవ్వడం వెనుక కారణం ఏంటి అని ప్యానెల్ నాయకులను అడిగితే..వారు చెప్పిన సమాధానం ఒక్కటే…నువ్వు ఫిల్మ్ జర్నలిస్ట్ వి…అదే నీ అర్హత అన్నారు. ఆ ఒక్క మాటతో….లేచి రెండు చేతులు జేబులో పెట్టుకోని ..నడుచుకుంటూ వెళ్లిపోయానంటూ గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ ఫంక్షన్ లో చెప్పిన మాటల అంత ఫీలింగ్ కలిగింది.. సారీ ఆ ఫీలింగ్ చెప్పే ప్రయత్నంలో ఈ పదాలు వాడాను…

ఈ గౌరవం ఇవ్వడానికి కారణం ఫిల్మ్ జర్నలిస్ట్ (అన్నీ విభాగాలు)ల ఐక్యత అని అర్ధమైంది..సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ లు ఇచ్చిన కనపడని ఆస్తి ఇదే. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ లోను , జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ ఎలక్షన్స్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ ల ఓట్లు కీలకంగా మారడమే ఇంధుకు నిదర్శనం అని చెప్పోచ్చు…గెలుపోటములు సహజమే…కానీ మన ఐక్యతను మరోసారి నాకు మీ ఓట్ల ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ప్రెస్ క్లబ్ , హౌసింగ్ సోసైటిలలో ఫిల్మ్ జర్నలిస్ట్ లు ఓట్లు కోసం చూపే ఆసక్తి ..అదే ఫిల్మ్ జర్నలిస్ట్ లకు మెంబర్ షిప్ ఇవ్వడానికి చూపట్లేదు…ఇచ్చిన వారికి టెంపరరీ కార్డ్స్ ఇష్యూ చేశారు… ఏళ్లు గడుస్తున్న రెగ్యూలర్ చెయ్యలేదు… ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ..మీకు అందుబాటులో ఉంటానని హమీ ఇస్తున్నాను…
ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే క్షమించండి..థాంక్యూ వెరీ మచ్
అభ్యర్ధన : మీ అమ్యూలమైన ఓటుతో పాటు మీ సంస్థలలో పనిచేస్తున్న ఉన్న ప్రెస్ క్లబ్ మెంబర్స్ , స్నేహితులతో ఓట్లు వేయించి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను… నా సీరీయల్ నెంబర్ , మా ప్యానెల్ డిటైల్స్ పంపిస్తున్నాను గమనించగలరు..థాంక్యూ వెరీ మచ్
మీ
అశోక్ దయ్యాల
బ్యాలెట్ సీరియల్ నెంబర్ : 4
సెల్ : 9550889907



