డిసెంబర్ 5న కార్తి “వా వాతియార్” వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

0
75
Karthi “Vaa Vaathiyaar” on December 5th

డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ “వా వాతియార్”

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. “వా వాతియార్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి నటిస్తున్న “వా వాతియార్” సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తి కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా “వా వాతియార్” నిలుస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here