నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవ్ జుయల్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. దసరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్’ ప్రతిష్టాత్మక స్థాయిలో రూపొందుతోంది. ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్ విడుదలైన తర్వాత మూవీ చుట్టూ బజ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు, మేకర్స్ వెరీ ట్యాలెంటెడ్ రాఘవ్ జుయల్‌ను సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. మేకర్స్ స్ట్రైకింగ్ BTS వీడియోతో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వీడియోలో శ్రీకాంత్ ఓదెల, రాఘవ్ క్యారెక్టర్ ని, బ్రూటల్ నేచర్ ని వివరిస్తున్నారు. సినిమాలో అతని పాత్ర గురించి తెలుసుకోవడానికి నటుడు ఉత్సాహంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
రాఘవ్ జుయల్ ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన యాక్టర్. కిల్, గ్యారా గ్యారా వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన అతను ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మెమరబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ సినిమాలో తన పాత్రపై ఊహాగానాలు నడుస్తుండగానే, ఇప్పుడు రాఘవ నాని శ్రీకాంత్ ఓదెల పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో మరో గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
రాఘవ్ జుయల్ 2026లో మేజర్ పాన్-ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ది ప్యారడైజ్ మార్చి 26, 2026న విడుదల కానుంది.
Team #TheParadise wishes the talented @TheRaghav_Juyal a very Happy Birthday
Welcoming him in a role that will be unique and will take everyone by surprise 💥#THEPARADISE in CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An… pic.twitter.com/8SK5k01cu0— BA Raju’s Team (@baraju_SuperHit) July 10, 2025
హాలీవుడ్ స్టూడియోతో కలిసి పనిచేయడం కోసం ప్రస్తుతం మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. అప్డేట్స్ని త్వరలోనే షేర్ చేసుకోబోతున్నారు. ‘ది ప్యారడైస్’ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ అనే ఎనిమిది భాషల్లో విడుదల అవుతుంది. ఈ సినిమా సినిమాటిక్ ఎక్స్‌లెన్స్‌కి ఇది న్యూ స్టాండర్డ్స్ నెలకొల్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా పాన్-వర్డ్ లెవెల్లో విడుదల కానుంది.
మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
తారాగణం: నాని, రాఘవ్ జుయల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
DOP: CH సాయి
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఆడియో: సరిగమ మ్యూజిక్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో



