గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది… — నందమూరి బాలకృష్ణ

0
279
Nandamuri Balakrishna

గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది…

ప్రయాణికులతో పాటు సిబ్బంది… అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.

ఈ ప్రమాదంలో మన భారతీయులతో పాటు విదేశీయులూ ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటై బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

— నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here