ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

0
277
SV Krishna Reddy Birthday Celebrations
SV Krishna Reddy Birthday Celebrations

ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు …ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు చిత్రంలో అర్జునుడిగా నటించాను. అది మా కాంబినేషన్ లో మొదటి సినిమా. ఆ తర్వాత వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం..ఇలా పది చిత్రాలు చేశాను. నేను హీరోగా ఎదిగేందుకు ఆయన సినిమాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చేసిన ఎన్నో చిత్రాల్లో నేను నటించాను. నా జీవితంలో యమలీల సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. స్నేహానికి వీరిద్దరూ మారుపేరు. నాలాగే ఎంతోమంది నటీనటుల కెరీర్ లను నిలబెట్టిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – నా నట జీవితం యమలీలకు ముందు యమలీల తర్వాత అని చెప్పుకోవాలి. ఆ సినిమాలో తోట రాముడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాల్లో నటించడం మర్చిపోలేని అనుభవం. అన్నారు.

SV Krishna Reddy Birthday Celebrations
SV Krishna Reddy Birthday Celebrations

లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు మా కుటుంబంలో పెద్ద లాంటి వారు. ఆయన నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం కూడా ఎస్వీ కృష్ణారెడ్డి కల్పించారు. మా కుటుంబం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అన్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడితే నా తండ్రి గురించి మాట్లాడినట్లు ఉంటుంది. నాకు యాక్టింగ్ రాకున్నా వినోదం సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పించారు. అలా నటుడిగా కొనసాగి పవన్ కల్యాణ్ గారి వల్ల నిర్మాతను అయ్యాను. నా జీవితం ఊహించని విధంగా మారిపోయింది. అన్నారు.

నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. మా ఇంట్లో ఇవాళ ఇంపార్టెంట్ వేడుక ఉన్నా ఇక్కడికి వచ్చాను. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు ఈవెంట్ లో పాల్గొనకపోతే తప్పుచేసిన భావం కలుగుతుంది. ఆయనతో మాకున్న అనుబంధం అలాంటిది. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు రామలక్ష్మణుల లాంటి వారు. అన్నారు.

నటి లయ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్లీ అవకాశం ఉంటే ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. అన్నారు.

SV Krishna Reddy Birthday Celebrations
SV Krishna Reddy Birthday Celebrations

నటి ఇంద్రజ మాట్లాడుతూ – నేను ఏ వేదిక మీద మాట్లాడినా ముందు ఎస్వీ కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పే మాట్లాడుతా. ఆయన లేకుంటే నాకు ఇంద్రజ అనే పేరు లేదు, హీరోయిన్ గా కెరీర్ లేదు. దేవుడు నా కోసం పంపిన ఏంజెల్ కృష్ణా రెడ్డి గారు అనుకుంటాను. అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ – దర్శకుడు కేవీ రెడ్డి గారిని ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు. దర్శకరత్న దాసరి గారికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వీ చెప్పుకునేవారు. ఎస్వీ కృష్ణారెడ్డిని నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేశా. మా కాంబినేషన్ లో గొప్ప చిత్రాలు రూపొందించాడు. మా మూవీస్ లో చేసిన కుటుంబమంతా దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గర్వంగా ఉంది. వాళ్లంతా మా ఎస్వీ బర్త్ డే వేడుకలకు రావడం సంతోషాన్నిస్తోంది. అన్నారు.

నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ – కుటుంబ కథా చిత్రాలను రూపొందించి ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచారు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక చిన్న సినిమా తీసినా అది చాలా పెద్ద విజయాన్ని అందుకునేది. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతుడటం ఎస్వీ కృష్ణారెడ్డి గారి మంచితనానికి, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అన్నారు.

నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణా రెడ్డి ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడిన వ్యక్తిని నేను. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఎన్నో గొప్ప చిత్రాల రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ సినిమాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎస్వీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్నారు.

SV Krishna Reddy Birthday Celebrations
SV Krishna Reddy Birthday Celebrations

నటి ఆమని మాట్లాడుతూ – ఇండస్ట్రీలో హీరోయిన్ గా నాకు జన్మనిచ్చింది ఈవీవీ గారు అయితే పెంచింది ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వంలో నేను నటించిన శుభలగ్నం మూవీ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు అడుగుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అన్నారు.

నటి రోజా మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో చేసిన శుభలగ్నం మూవీ నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఎంత ఫార్వార్డ్ గా కృష్ణారెడ్డి గారి క్రియేటివిటీ ఉందో ఊహించుకోవచ్చు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.

దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ఎందరో మహానుభావులు. వాళ్లందరికీ నా తరుపున నమస్కారాలు చెబుతున్నా. నేను ఈ ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లు స్వతహాగా మంచి టాలెంట్ ఉన్నవారు. నా మూవీస్ ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేగానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. నన్ను మొదటినుంచీ ప్రోత్సహిస్తూ, నా వెంటే అండగా నిలబడిన అచ్చిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అలాగే హీరోగా నటించి నా మొదటి మూవీకి అవకాశం ఇచ్చిన రాజేంద్రప్రసాద్ గారికి థ్యాంక్స్. అన్నారు.

SV Krishna Reddy Birthday Celebrations
SV Krishna Reddy Birthday Celebrations

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here