కమల్ హాసన్, శింబు, మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి ‘ఓ మార’ సాంగ్ రిలీజ్

0
262
O Maara From Thug Life
O Maara From Thug Life
కమల్ హాసన్, శింబు, మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి ‘ఓ మార’ సాంగ్ రిలీజ్  

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈరోజు, మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఓ మార’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

ఎఆర్ రెహమాన్ కంపోజిషన్ మర్చిపోలేని  రైడ్‌ను అందిస్తుంది. ట్యూన్ బీట్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శింబు బోల్డ్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తోంది.

https://www.youtube.com/watch?v=6n4WzBe_P6s&ab_channel=SaregamaTelugu

ఆదిత్య ఆర్కే  సాంగ్ ని పాడిన విధానం అదిరిపోయింది, రాకేందు మౌళి రాప్  సాంగ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అనంత శ్రీరామ్ థగ్ లైఫ్ ప్రపంచం లాగానే ట్రెండీ, ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ అందించారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్‌ ఎన్ సుధాకర్ రెడ్డి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here