PRESS NOTE
Dt. 20.03.2025
2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తుల (1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు. పేర్లు మీద “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేస్తున్నందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, గారికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరియు తెలంగాణ FDC చైర్మన్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్రాజు) గారికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇందుమూలంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను పునరుద్ధరించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణలో చలనచిత్ర నిర్మాణాన్ని మరింతగా ప్రోత్సహిస్తుంది. అని తెలియజేసింది.
