రివైండ్ సినిమా సమీక్ష

0
188
Rewind Movie Review - Sai Ronak - Amrutha Chowdhary
Rewind Movie Review - Sai Ronak - Amrutha Chowdhary

“రివైండ్” సినిమా సమీక్ష

రివైండ్ మూవీ స్టోరీ

కార్తిక్(సాయి రోనక్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఒకరోజు కార్తిక్ శాంతి(అమృత)ని చూడగానే కార్తిక్ ప్రేమలో పడిపోతాడు. అయితే లక్కీగా ఆమె కార్తిక్ పనిచేస్తున్న ఆఫీస్ లోనే జాయిన్ అవ్వడంతో పరిచయం పెరుగుతుంది. క్లోజ్ అయ్యాక కార్తీక్ శాంతికి ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలోనే కార్తిక్ కు శాంతి తన తాత కృష్ణమూర్తి(సామ్రాట్) గురించి చెబుతుంది. తన తాత కృష్ణమూర్తి టైమ్ మిషన్ ని కనిపెట్టాడని చెబుతుంది. అంతేకాక తాను ప్రేమలో ఉన్నానని కూడా చెబుతుంది. శాంతి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న కార్తిక్ కి తన ఇంట్లోనే టైమ్ మిషన్ దొరుకుతుంది. ఒకవేళ టైం ట్రావెల్ చేయగలిగితే కరోనా టైంలో చనిపోయిన తన తండ్రిని బతికించుకోవడంతో పాటు శాంతి మరో వ్యక్తితో ప్రేమలో పడకుండా చేయవచ్చు అని అనుకుంటాడు. ఈ క్రమంలో వెనక్కి వెళ్లాడా? ముందుకు వెళ్లాడా? శాంతి లవ్ చేసింది ఎవరిని? శాంతి తాత టైం మిషన్ కార్తీక్ ఇంట్లో ఎలా దొరికింది? లాంటి విషయాలు మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

 

కళాకారుల ప్రదర్శన

ఈ మూవీకి హీరో- హీరోయిన్లలే ప్రధాన బలం. సాయి రోనక్.. కార్తిక్ పాత్రలో బాగా నప్పాడు. కథ మొత్తాన్ని తన భుజాల మీద ముందుకు తీసుకెళ్లాడు. ఇంక అమృతని చూస్తే డెబ్యూ తీసుకు వెళ్ళే పాత్రలో ఇమిడి పోయాడు. ఇక అమృత అందంగా కనిపించడమే కాదు తనదైన శైలిలో నటనతో ఆకట్టుకుంది. సాయి రోనక్- అమృత పెయిర్ స్క్రీన్ మీద ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సీనియర్ నటుడు సురేశ్ కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కనిపించింది కొంచెం సేపే అయినా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక బృందం

ముందుగా డైరెక్టర్ గురించే చెప్పాలి. కొత్త డెరెక్టర్ అయినా కూడా కల్యాణ్ చక్రవర్తి ఆడియన్స్ ని తన మొదటి సినిమాతోనే భలే సినిమా చేశారు అనిపించుకున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో తన ప్రతిభ చాటుకున్నారు. ఆశ్వీర్వాద్ ల్యూక్ సంగీతం బాగుంది.. చాలా సన్నివేశాల్లో బీజీఎం ఆకట్టుకుంటుంది. వొద్దు వొద్దు సాఫ్ట్ వేర్, లవ్ యూ నాన్న సాంగ్స్ వినడానికి బాగున్నాయి. శివరామ్ చరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ 

ఈ మూవీలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ గురించి ట్రైలర్ లోనే చెప్పేయడంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. సైంటిస్ట్ కృష్ణమూర్తి ఎంట్రీతో ఈ సినిమాని ఓపెన్ చేసి 30 ఏళ్ల ఫ్యూచర్ లోకి వచ్చి మళ్లీ మాయం అయిపోతాడు. ఆ తరువాత ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం శాంతి- కార్తిక్ మధ్య పరిచయం, స్నేహం, బ్యాక్ ఎండ్ లో కృష్ణమూర్తి, టైమ్ మిషన్ గురించి హింట్స్ ఇస్తూ కథను నడిపించాడురు. అయితే ఆ క్రమంలో కథలో చాలానే ప్రశ్నలు సంధించారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో టైమ్ ట్రావెల్ చేసి వెళ్ళాక ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వెళ్లిన తీరు ఆకట్టుకుంది. నిజానికి ఫస్ట్ ఆఫ్ జరిగిన కథను రివైండ్ చేసి మళ్లీ ప్లే చేసి మొదటి భాగంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వెళ్లారు. ఒక్కో ట్విస్టు రివీల్ అవుతూ ఉంటే ఆడియన్స్ ఆనందించే లోపు మరికొన్ని ప్రశ్నలు సంధించి రివైండ్ మూవీ పార్ట్ 2 కోసం లీడ్ వదిలారు.

తుది తీర్పు

ఆసక్తికరంగా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “రివైండ్”

రేటింగ్

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here