దీపావళి కానుకగా గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్

0
35
NBK 109 - Sankranthi 2025 - Nandamuri BalaKrishna
NBK 109 - Sankranthi 2025 - Nandamuri BalaKrishna
దీపావళి కానుకగా గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్
– దీపావళికి ‘NBK109’ టైటిల్ టీజర్
– 2025 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను  అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు.
తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.
ఇప్పటివరకు, నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించలేదు. దీంతో టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ దీపావళికి వారి నిరీక్షణకు తెరపడనుంది. దీపావళి శుభ సందర్భంగా,  ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దీనిలో గుర్రంపై స్వారీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ ని దర్శకుడు బాబీ, వయొలెంట్ పాత్రలో స్టైలిష్ గా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here