‘మా నాన్న సూపర్ హీరో’ నా కెరీర్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు

0
144
Nava Dhalapathy
Nava Dhalapathy "Sudheeer Babu"- Maa Nanna Super Hero - Teaser Launch Event

‘మా నాన్న సూపర్ హీరో’ నా కెరీర్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుధీర్ బాబు సన్ అఫ్ పోసాని నాగేశ్వరరావు. మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న అహర్నిశలు కష్టపడేవారు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన నాన్నకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. టీజర్ చూస్తే ఈ సినిమా థీం అందరికీ అర్ధమైవుంటుంది. ఇది మార్వల్ సూపర్ హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో వుంది. ఆ పవర్ పేరు ప్రేమ. ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టొరీ ఇది. కథ విన్నప్పపుడు ఎంత ఇష్టపడ్డానో , చేసినప్పుడు అంతే ఇష్టంగా చేశాను. మీరు చూసినపుడు కూడా అంతే ఇష్టంగా ఈ సినిమా చూస్తారనే నమ్మకం వుంది. మనందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ‘నాన్న’.  నాకు హార్ట్ ఫుల్ గా నచ్చిన సినిమా ఇది. నా కెరీర్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇది. మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ అభిలాష్ తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తన ట్యాలెంట్ ని అక్టోబర్ 11న ఆడియన్స్ విట్నెస్ చేస్తారు. నిర్మాతలు వంశీ, సునీల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా కలసి సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. వారి బ్యానర్ లో నేను హీరోగా చేయడం డ్రీం ఫర్ మీ. ఇందులో కొత్త సాయాజీ షిండే ని చూస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సాయి చంద్ గారు టెర్రిఫిక్ గా చేశారు. చాలా మంచి రోల్ అది. ఆర్ణ చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి మంచి పేరు వస్తుంది. శశాంక్ చాలా యీజ్ తో నటించారు. జై క్రిష్ మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. డీవోపీ సమీర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్ యూ.  సోషల్ మీడియాలో టీజర్ ని లాంచ్ చేసిన నానికి థాంక్ యూ. టీజర్ తనకి చాలా నచ్చింది. ఇందులో నేను చేసిన పాత్ర ఎగ్జాట్ గా మా నాన్నగారే. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ కి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

యాక్టర్ సాయాజీ షిండే మాట్లాడుతూ.. నా కెరీర్ లో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా చేసినందుకు గర్వంగా వుంది. సుధీర్ బాబు కి ఫాదర్ గా యాక్ట్ చేయడం ప్రౌడ్ గా వుంది. ఈ సినిమా చేసినప్పుడు నాన్న గుర్తుకు వచ్చారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడండి. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి’ అన్నారు.

హీరోయిన్ ఆర్ణ మాట్లాడుతూ.. మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. ఇంత బ్యూటీఫుల్ ఫిలిం లో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. చాలా మంచి ఎమోషన్ వున్న సినిమా ఇది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ.. నాకు మ్యూజిక్ పరిచయం చేసిన నాన్న , తర్వాత ఆ భాద్యత తీసుకున్న అమ్మ నా సూపర్ హీరోస్. అభిలాష్ కి థాంక్. ఈ సినిమాలో సుధీర్ బాబు గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. పాటలు చాలా బావొచ్చాయి. సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

యాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అమ్మ నాన్న నా సూపర్ హీరోస్. మా నాన్న సూపర్ హీరో బ్యూటీఫుల్ స్టొరీ. థియేటర్స్ కి రండి. సినిమాని లవ్ చేస్తారు. కొత్త సుధీర్ బాబుని చూస్తారు. మీ అందరితో కలసి సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

డైరెక్టర్ అభిలాష్ కంకర మాట్లాడుతూ.. మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా మా నాన్నే. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఫాదర్ సన్ మధ్య జరిగే బ్యూటీఫుల్ స్టొరీ ఇది. ఈ సినిమా చేయడానికి బ్యూటీఫుల్ టీం దొరికింది. నిర్మాతలు వంశీ గారు సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఇది హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది.  ఖచ్చితంగా  ఎంజాయ్ చేస్తారు’ అన్నారు

తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
పీఆర్వో: వంశీ-శేఖర్

Click Here To Read Maa Nanna Super Hero >> English Article

 

Nava Dhalapathy - Maa Nanna Super Hero - Teaser Launch Event
Nava Dhalapathy “Sudheeer Babu”- Maa Nanna Super Hero – Teaser Launch Event

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here