ప్రకృతిని కాపాడే పాత్రలో ఆదిత్య ఓం.. ‘బంధీ’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాతలు

0
149
Aditya Om in a Nature-Conserving Role In 'Bandhi': The Makers At Teaser Launch Event
Aditya Om in a Nature-Conserving Role In 'Bandhi': The Makers At Teaser Launch Event

ప్రకృతిని కాపాడే పాత్రలో ఆదిత్య ఓం.. ‘బంధీ’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాతలు

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాలను చేస్తున్న ఆదిత్య ఓం నుంచి బంధీ అనే సినిమా త్వరలోనే రాబోతోంది. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..

దర్శక నిర్మాత రఘు తిరుమల మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాను. ఆయన ద్వారా ఎంతో నేర్చుకున్నాను. సినిమాలో కేవలం ఒక్క కారెక్టరే ఉంటుంది. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారు. అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అన్నది చివరకు చూస్తారు. కరోనా తరువాత ప్రకృతి మీద అందరికీ అవగాహన ఏర్పడింది. అందుకే ఈ కథను రాసుకున్నాను. ఆదిత్య ఓం ఎంతో ఒదిగి ఉండేవారు. టీంతో ఎంతో బాగా ఉండేవారు. మూడేళ్లలో ఆయన్ను చాలా దగ్గర్నుండి చూశాను. ఆరేడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కొంత పని జరుగుతోంది. ఆదిత్య గారు సినిమాలో ఎక్కడా కూడా డూప్ వాడనివ్వలేదు. సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. పంచభూతాలతో అడవిలో మమేకమై ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో భిన్నమనస్తత్వాలు కూడిన మనుషులతో కలిసి ఉన్నాడు. సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నరకాసుర నిర్మాత కారుమూరు మాట్లాడుతూ.. ‘రఘు ఈ చిత్రాన్ని బాగా తీశారు. సినిమాకి ఏం కావాలో అది చేశారు. ఆదిత్యను ఇరవై ఏళ్ల క్రితం కలిశాను. ఆయన నన్ను ఇన్నేళ్లుగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సినిమాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకున్నారు. మన అందరి కోసమే బిగ్ బాస్ షోకి వెళ్లారు. ఆయన వల్లే నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది’ అని అన్నారు.

యూఎస్ డిస్ట్రిబ్యూటర్, వీఎఫ్ఎక్స్ హెడ్ జాకబ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ రఘుని హైద్రాబాద్‌లో కలిశాను. రంపచోడవరంలో షూటింగ్ చేసినప్పుడు చూశాను. రఘు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీశారు. ఆదిత్య ఓం నటించిన లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐలవ్యూ ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రకృతి కోసం తీసిన ఈ చిత్రం అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇండియా, అమెరికా అన్ని చోట్లా ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను’ అని అన్నారు.

ఈ చిత్రానికి
బ్యానర్‌ – గల్లీ సినిమా
దర్శకుడు – రఘు తిరుమల
నిర్మాత – వెంకటేశ్వరరావు దగ్గు, రఘు తిరుమల.
DOP – మధుసూదన్ కోట
ఎడిటర్, పోస్ట్ ప్రొడక్షన్- ప్రకాష్ ఝా
సంగీతం – వీరల్, లవన్, సుదేష్ సావంత్
కో డైరెక్టర్ – అలోక్ జైన్
కథ, స్క్రీన్‌ప్లే – ఆదిత్య ఓం
క్రియేటివ్ హెడ్ – టి.రాఘవ్
సౌండ్ డిజైనర్ – కైలాష్
ప్రొడక్షన్ మేనేజర్ – మహమ్మద్ షేక్
PRO – సాయి సతీ

Click Here << To Read Tovino Thomas ARM movie Review – English

Click Here>>Bhandhi Teaser

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here