50 లక్షలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ

0
58
China Babu-Trivikram-Naga Vamsi
China Babu-Trivikram-Naga Vamsi


50 లక్షలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ

Sep 03, 2024, Tuesday

గత కొద్దిరోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా రు. 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ. ఏపీకి రూ.25లక్షలను, తెలంగాణకు రూ.25లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు  మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము.

-త్రివిక్రమ్.
నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
ఎస్. నాగవంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here