రేవు సినిమా రివ్యూ

0
148
Revu Movie Review
Revu Movie Review

రేవు సినిమా రివ్యూ

నటీనటులు

వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు

దర్శకుడు

హరినాథ్ పులి

రేవు కథ

కోస్తా తీరం ప్రాంతంలోని పాల రేవు అనే గ్రామంలో అంకులు(వంశీరామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్) ఇద్దరూ బావాబామ్మర్దులు. ఒకరంటే ఒకరికి పడదు. దీంతో చిన్న నాటు పడవలలో చేపల వేటతో పోటీపడుతూ కస్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే అదే ఊరిలో ఉండే నాగేశు(యేపూరి హరి) ఓ పెద్ద బోటు తీసుకొచ్చి రేవు నుంచి లోపలికి వెళ్లి పెద్ద చేపలు పట్టి తెచ్చి అమ్మడం మొదలు పెట్టడంతో కంపెనీ వాళ్ళు అంకులు-గంగయ్య బ్యాచ్ లు తెచ్చే చేపలు కొనడం మానేస్తారు. దీంతో నాగేశు తమ్ముడి కొడుకు సాయంతో మారబోటు రెడీ చేయగా అది నచ్చని నాగేశు తమ్ముడి కొడుకుని చంపుతాడు. దీంతో కోపం వచ్చి గంగులు-అంకయ్య నాగేశును చంపేస్తారు. ఈ క్రమంలో నాగేశు కొడుకులు ఊర్లోకి దిగుతారు. వారు అంకులు, గంగయ్యలను ఏం చేశారు..? పాలరేవులో చేపల వేట ఎవరికి దక్కింది? కొనసాగించారు..? అంకులు, గంగయ్యల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే

ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, అజయ్ లు ఇద్దరూ మత్స్యకారుల పాత్రలలో జీవించారు. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. ఎమోషనల్ సీన్స్ లో రాణించారు. వంశీ రామ్ పెండ్యాలకు అయితే హీరోగా మంచి భవిష్యత్తు ఉంది. ఇక హీరోయిన్ గా నటించిన స్వాతి కూడా మంచి నటన కనబరిచింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం 

దర్శకుడు హరినాథ్ పులి ‘రేవు’ సినిమాకు గానూ ఎంచుకున్న నేపథ్యం బాగుంది. అయితే, కథలో కొత్తదనం లేకపోయినా మనవాళ్ళు బాగా ఇష్టపడే ఒక రివెంజ్ డ్రామాగా మలచిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా నటీనటుల నుంచి రస్టిక్ పర్ఫార్మెన్స్‌లు రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు జాన్ కె జోసెఫ్ పాటలు ఫర్వాలేదు అనిపించినా వైశాఖ్ మురళీధరన్ బీజీఎం అయితే అదరకొట్టాడు. ఇక ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ సినిమాకు అందం తెచ్చిపెట్టింది. కోస్తా తీర అందాలను బాగా కాప్చర్ చేశారు. ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాలోని ప్రతి ఫ్రేం కూడా సినిమాకు తగ్గట్టు బాగుంది. ముఖ్యంగా సినిమాకి క్రియేటివ్ సూపర్ విజన్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబుల సీనియారిటీ, క్రియేటివిటీ సినిమాలో ప్రతిబింబించింది.

విశ్లేషణ

గంగపుత్రులు (మత్స్యకారులు) జీవితాల్లో జరిగే సంఘటనల సమాహారమే ఈ ‘రేవు’ కథ. సముద్ర తీరంలో చేపల వేట ఎలా ఉంటుంది? వాళ్లకు ఒక సమస్య వస్తే పగవాళ్ళు అనుకున్న వాళ్ళు సైతం ఎలా కలిసి నిలబడ్డారు అనేదాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చి దిద్దారు. సినిమాలో పాత్రల పరిచయాలు, అసలు కథలోకి తీసుకు వెళ్లేందుకు ఇంటర్వెల్ దాకా సమయం తీసుకున్న డైరెక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆ తరువాత నుంచి ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేశాడు. కథ రా అండ్ రస్టిక్‌గా ఉండటంతో ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో సహజత్వాన్ని చూపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించిన తీరు ఆకట్టుకుంది. తమిళులు చేసే లాంటి రా అండ్ రస్టిక్ సినిమాలు ఎందుకు చేయరు అనుకునే వాళ్లకు ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ.

తీర్పు

‘రేవు’ సినిమా ఒక పర్ఫెక్ట్ రా అండ్ రస్టిక్ రివెంజ్ డ్రామా.

రేటింగ్

3/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here