“నీ దారే నీ కథ” మూవీ రివ్యూ

0
523

నటీనటులు :

ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.

టెక్నికల్ టీం :
బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్
నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ.
రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి
సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు
కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట
ఎడిటర్ : విపిన్ సామ్యూల్
దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ
పి ఆర్ ఓ : మధు VR

ప్రియతమ్ మంతిని, సురేష్ గారు, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్, ప్రధాన పాత్రల్లో అజయ్ గారు, పోసాని కృష్ణ మురళి గారు అతిథి పాత్రల్లో నటించగా వంశీ జొన్నలగట్ట దర్శకత్వంలో తేజేష్ వీర నిర్మాతగా వచ్చిన సినిమా నీ దారే నీ కథ. ఆల్బర్ట్టో గురియోలి మ్యూజిక్ అందించగా ఎలెక్స్ కావు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

కథ విషయానికొస్తే : అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటారు. ఒక మంచి మ్యూజిషియన్ గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం చేయాలనేది అతని కోరిక. తనకు తన తండ్రి (సురేష్) సపోర్ట్ ఉంటుంది. తన అనుకున్న సాధించే ప్రయత్నంలో తన టీమ్ లో ఉన్న ఒక ఫ్రెండ్ టీమ్ నుంచి తప్పుకున్నప్పుడు తనకు సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. అర్జున్ తండ్రి అర్జునుని అనుకున్న సాధించి ఒక మంచి మ్యూజిషియన్ గా చూడాలనుకుంటాడు. కానీ ఆయన మధ్యలో మరణిస్తాడు. తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని చాలా బాగా చూపించారు. తన తండ్రి కోరికని అర్జున్ నెరవేర్చాడా లేదా? తను అనుకున్నది సాధించి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసి మ్యూజిషియన్ అయ్యాడా లేదా? తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారు అంటే : ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా సురేష్ గారు నిలుస్తారు. సపోర్ట్ చేసే తండ్రి పాత్రలో ఆయన నటన చాలా బాగుంది. ప్రియతమ్ కొత్తవాడైన చాలా బాగా నటించాడు. విజయ్ విక్రాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నవ్విస్తూ ఎమోషన్ పండిస్తూ మంచి నటనని కనబరిచాడు. అజయ్, పోసాని కృష్ణమురళి గారు తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. అంజనా బాలాజీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ బాగా నటించింది.

టెక్నికల్ టీం : వంశి జొన్నలగడ్డ ఎంచుకున్న కథ ఈ కాలంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకొని వచ్చాడు. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టీం వర్క్ తో పని చేశారు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్టుగా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సింగ్ సౌండ్ అయినా కూడా ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ ఆఫ్

విజయ్ విక్రాంత్ క్యారెక్టర్

సురేష్ గారు

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్

హీరోయిన్

సినిమాటోగ్రఫీ

రేటింగ్ : 3/5

ఫైనల్ వెర్డెక్ట్ : తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని అద్దం పట్టేలా చూపిన సినిమా.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here