హిట్ లిస్ట్ మూవీ రివ్యూ

0
64

సినిమా: హిట్ లిస్ట్

నటీనటులు :
విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.

విడుదల తేదీ: 31-05-2024

నిర్మాణం : ఆర్. కె. సెల్లులాయిడ్స్
నిర్మాత : కె. ఎస్ రవికుమార్
ఎడిటర్ : జాన్ అబ్రహం
మ్యూజిక్ : సి. సత్య
డి ఓ పి : కే. రామ్ చరణ్
కథ : ఎస్. దేవరాజ్
దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్
తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్
తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ ప్రొడ్యూసర్స్ : శ్రీనివాస్ గౌడ్ మరియు బెక్కం రవీందర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

ఈ మధ్య కాలంలో బాషా భేదం లేకుండా ఇతర పరిశ్రమకు చెందిన సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్యకాలంలో మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. అలా మన ముందుకు వచ్చిన మూవీ హిట్ లిస్ట్. తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సితార ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఇది. సూర్యకతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా పిట్ లిస్ట్. ఈవారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ:

విజయ్ (విజయ్ కనిష్క) తన అమ్మ (సితార), చెల్లి తో కలిసి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎవరితోనో గొడవలు పడకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జీవ హింస నేరం పాపమని భావిస్తాడు. అలాంటి తన జీవితంలో ఒకరోజు ఒక మలుపు తీసుకుంటుంది. ఒక రోజు త‌న‌కు ఒక‌ కాల్ వస్తుంది. తన అమ్మని, చెల్లిని కిడ్నాప్ చేశానని వాళ్ళని వదిలి పెట్టాలంటే తాను చెప్పింది చేయాలి అని డిమాండ్ చేస్తాడు మాస్క్ మాన్. ఆ కిడ్నాప‌ర్ నుంచి అమ్మ‌ని, చెల్లాయిని ర‌క్షించ‌డానికి విజయ్ ఇద్దరిని మర్డర్ చేయాల్సి వస్తుంది. ఈ కేసుని ఏసిపి యెజ్హ్వెందన్ (శరత్‌కుమార్) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంతకీ యెజ్హ్వెందన్ విజయ్ కి సపోర్ట్ చేశాడా లేదా? అసలు ఈ మాస్క్ మాన్ ఎవరు? విజయ్ అమ్మని, చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? గౌతమ్ వాసుదేవ మీనన్ కి విజయ్ కి అలాగే సముద్రఖనికి విజయ్ కి సంబంధం ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే!

నటీ నటుల పనితీరు:

విజయ్ కనిష్క కి ఇది మొదటి సినిమా అయిన నటన పరంగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు. శరత్‌కుమార్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ ప్లే చేశాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖ‌ని, సితార, రామచంద్ర రాజు (కేజిఎఫ్ గరుడ) త‌మ పాత్ర‌ల‌తో మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ నటన
రెండో భాగం
శరత్‌కుమార్
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం
ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్

విశ్లేషణ :

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి హిట్ లిస్ట్ మూవీ ఒక కొత్త థ్రిల్లింగ్ కాన్సెప్ట్ గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన కొంతసేపు స్లోగా ఉన్నా తక్కువ సమయంలోనే కథలోకి వెళ్లిపోయారు. కథలోకి వెళ్లిన అనంతరం ప్రేక్షకుడి ఆసక్తిగా ఎదురుచూసే అంశాలు చాలా ఉన్నాయి. హీరో విజయ్ తన తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి మాస్క్ మాన్ చెప్పింది చేయడం. అదేవిధంగా శరత్ కుమార్ గారి క్యారెక్టర్ లోని పవర్ ఫుల్ నెస్. రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ) క్యారెక్టర్ లోని విలనిజం. తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి తాపత్రపడే సెంటిమెంట్ సీన్స్. కరోనా పాండమిక్ సమయంలోనే జరిగిన కొన్ని సంఘటనలు ఎమోషనల్ గా చూపించడం. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3/5

చివరగా : థ్రిల్లింగ్ రివెంజ్ డ్రామా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here