విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

0
27

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. లావిష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు. పాటలో వధూవరులుగా విజయ్ దేవరకొండ, మృణాల్ మెరిసిపోయారు. పెళ్లి వేడుకల్లోని సందడి అంతా ఈ పాటలో కనిపించింది. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ పాటలోని కాస్ట్లీ సెట్ ప్రాపర్టీస్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విజయ్, మృణాల్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ పాటను కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here