‘రికార్డ్ బ్రేక్’ మూవీ రివ్యూ

0
220

చిత్రం: రికార్డ్ బ్రేక్

విడుదల తేదీ: 08-04-2024

నిర్మాత, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాస రావు

తారాగణం: నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా, ప్రసన్న కుమార్, సత్య కృష్ణన్

కథ: అంగిరెడ్డి శ్రీనివాస్

సంగీతం: సబు వర్గీస్

కెమెరామన్: కంతేటి శంకర్

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీగా రికార్డ్ బ్రేక్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదలవాడ శ్రీనివాస రావు స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 8 న థియేటర్లలో విడుదల అయింది. సినిమా ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.

కథ:

కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాధలుగా మారతారు. అలా ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ ఛాంపియన్స్ గా ఎలా నిలిచారు? అలాంటి అనాధలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

కొత్త వాళ్ళైనా కూడా నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా చాలా బాగా నటించారు. తమ పాత్రలకు అనుగుణంగా ఎమోషన్స్ ను పలికించారు. సత్య కృష్ణ క్యారెక్టర్ సినిమాకి హైలైట్. తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. విలన్ గా టి. ప్రసన్నకుమార్ చక్కగా సరిపోయారు. మంచి అభినయం కనబరిచారు. పాత్రధారుల కంటే పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. దర్శకుడు చదలవాడ శ్రీనివాస రావు అలా మలిచారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని నిర్మాణం. చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంచుకున్న కథ డైరెక్షన్ ఆకట్టుకుంటాయి. దేశభక్తి అంశాలతో పాటూ రైతుల గురించి, తల్లి సెంటిమెంట్ గురించిన అంశాలను కథలో భాగం చేయడం బాగుంది. ఇన్ని అంశాలను సమపాళ్లలో మేళవించి దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు ఆకట్టుకునేలా తెరకెక్కించడం దర్శకుడిగా ఆయన ప్రతిభకు నిదర్శనం. సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఆకట్టుకుంటుంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

నిహారిక పూర్, నాగార్జున, సత్య కృష్ణ, రగ్ధా ఇఫ్తాకర్, టి. ప్రసన్నకుమార్ విలనీ
చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం
అంగి రెడ్డి శ్రీనివాస్ కథ
సాబు వర్గీస్ సంగీతం
వి ఎఫ్ ఎక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం
అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్

చివరగా :ప్రతి భారతీయుడు చూసి గర్వించే చిత్రం

రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here