ఘనంగా మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

0
122

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు రావడం నిజంగా ఆనందదాయకం. ఈ రోజున నిజంగా హైదరాబాద్ ఒక ముఖ్య ప్రాంతంగా మారడం. ఇక్కడ నుంచి మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాని నిర్మల్ ప్రాంతం వాళ్ళు నిర్మించడం, నటించడం చాలా శుభ పరిణామం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత వెంకటరమణ గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలి ఈ సినిమా మన సక్సెస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో నిహాన్ మాట్లాడుతూ : ఈరోజు మా అమ్మగారు నిర్మల గారు ఇక్కడికి రాలేదు. నేను సినిమాలో నటించాలి అనుకుంటున్నాను అంటే చేయి బేటా నువ్వు కచ్చితంగా అవుతారు సక్సెస్ అవుతావు అని నన్ను ప్రోత్సహించింది మా అమ్మగారే. ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించింది. చాలా కష్టపడి సినిమాని చాలా మంచి లొకేషన్స్ లో నిర్మించాం. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ : ఇది నాకు మొదటి సినిమా. నా పేరెంట్స్ కి ఫస్ట్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. అమ్మాయి ఇండస్ట్రీలు ఎదగడం అనేది చాలా కష్టం అది పేరెంట్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్స్ కి నా కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కో డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ : నా పేరు రవీంద్ర సిద్ధార్థ పూరి. నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిని. మా డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసి మధ్యలో వదిలేస్తే. సెకండ్ షెడ్యూల్ నేను పూర్తి చేశాను. హైదరాబాదులో ఉండే వాళ్ళకే కాకుండా టాలెంట్ అన్నిచోట్ల ఉంది మేం నిర్మల్ నుంచి వచ్చాము సో లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరన్నా కూడా టాలెంట్ ని పట్టుకోండి. మాలాంటి దర్శకులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్

టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఆర్ ఎస్ మూవీ మేకర్స్
నిర్మాతలు : రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత
డి ఓ పి : వాసు
మ్యూజిక్ : పీకే
సింగర్ దివ్య మాళిక
ఎడిటర్ : అలోషియస్ – నరేష్
ఆర్ట్ : రవీందర్. పి
డైలాగ్స్ : కే. నరసయ్య చారి
డైరెక్టర్ : రవి బాసర
పి ఆర్ ఓ : మధు VR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here