యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. ఇటీవల విడుదలైన శ్రీరంగనీతులు. ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుంది. టీజర్‌తో అందరి మన్నన్నలు పొందిన ఈ చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్రం నుంచి వినరా వినరా చెబుతా వినరా ఈ కాలం శ్రీరంగనీతులు అంటూ కొనసాగే సినిమా టైటిల్ సాంగ్‌ను శనివారం విడుదల చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకు అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు.
#sriranganeethulu title track lyrical video from #sriranganeethulu out now🥁🥁#SRNhttps://t.co/kWWqQcTffc#Sriranganethulu#radhavientertainments@ActorSuhas@KarthikRathnam3@iRuhaniSharma@viraj_ashwin
@TanikellaBharani pic.twitter.com/ZnSrtoRvgW— BA Raju's Team (@baraju_SuperHit) February 17, 2024
వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్, కార్తీక్‌రత్నం,
రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.
youtu.be/CnRlpKbPX-A



