‘కిస్మత్’ మూవీ రివ్యూ

0
68

చిత్రం: కిస్మత్

విడుదల తేదీ: 03-02-2024

నటీనటులు: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి

దర్శకుడు: శ్రీనాథ్ బాదినేని

నిర్మాత: రాజు

సంగీతం: మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: వేద రామన్ శంకరన్

కిస్మత్ – ముఖ్య పాత్రలుగా నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ, రియా సుమన్, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ చేసారు. శ్రీనాధ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 2వ తేదీన రిలీజ్ కావడం జరిగింది.

కథ :

నరేష్, అభినవ్, విశ్వదేవ్ ముగ్గురు బిటెక్ చదివి ఒకే ఊరుకు చెందిన ముగ్గురు కలిగే ఉండే మిత్రులు. వీళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి జాబ్ ట్రయిల్స్ చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో నరేష్ కు రియా పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. రాజకీయ నాయకుడు అయిన అజయ్ ఘోష్ దగ్గర పని చేసే టెంపెర్ వంశితో పరిచయం కావడం,అదే పరిచయంలో ర్యాలీకి వెళ్తే డబ్బులు వస్తాయ్ అని తెలిసి ఆ ర్యాలీకి వెళ్లడం జరుగుతుంది.

ఇలా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం వచ్చేలా చేస్తా అని, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనడంతో డబ్బు కోసం ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి డబ్బు కాజేసే ప్రయత్నంలో వాళ్లకి 2 కోట్లు దొరుకుతాయి. అదే సమయంలో అజయ్ ఘోష్ 2 కోట్లు పోవడం జరుగుతుంది. అలా మలుపు తిరిగిన వారి జీవితంలో తరువాత ఆ డబ్బు వళ్ళ వారికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాల్లో నుండి ఎలా బయట పడ్డారు, అవసరాల శ్రీనివాస్ వీళ్ళ జీవితంలోకి ఎలా వచ్చారు, అని తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేసారు. అందరూ నవ్విస్తూ మంచి కామెడీ టైమింగ్ తో అదరకొట్టారు అని చెప్పుకోవచ్చు. అభినవ్ ఘోమటం తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించాడు. సమీర్ చివరిలో వచ్చి మంచి ట్విస్ట్ ఇస్తారు.

సాంకేతికనిపుణుల పనితీరు:

ఈ సినిమాకు కథ, కథనం, డైలాగ్స్ కూడా కామెడీ పండేలాగా సినిమాకి ప్లస్ గా ఉన్నాయి . సెకండ్ హాఫ్ లో డబ్బు కోసం అందరూ వెతికే కన్ఫ్యూజన్ కథనం కూడా క్లారిటీగా రాసుకున్నారు. కెమెరా విజువల్స్, నిర్మాణం విలువలు బాగానే ఉన్నాయి. కామెడీకి సెట్ అయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికి ఈ సినిమా బిటెక్ చదివే కుర్రాళ్ళ జీవితాలు చూపిస్తూ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

విశ్లేషణ :

ఫస్ట్ హాఫ్ అంత కామెడీగా ఊర్లో, ఇంకా హైదరాబాద్ వచ్చాక వారి ప్రయాణంతో ఉండగా, డబ్బు దొరకడం తో ఇంటర్వెల్ వస్తుంది. ిన సెకండ్ హాఫ్ కి వస్తే వస్తే ఆ డబ్బుతో వారికి వచ్చే కష్టాలు, ఆ డబ్బు కోసం వెతకడం, కాంఫుసే లేకుండా టామ్ & జెర్రీ ఫైట్ ల అనిపిస్తుంది. అయితే కథలో ముఖ్యంగా బిటెక్ చదివి ఖాళీగా ఉండే వాళ్ళు, జాబ్స్ లేకపోవడం, గవర్నమెంట్ ఇచ్చే ఫీజ్ రీయింబర్సమెంట్స్ కోసం పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలపై చర్చించాడు. ఈ సీరియస్ విషయాన్ని కూడా కామెడీతో బాగా చూపించాడు. అలాగే క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో సినిమాని ముగిస్తారు.

రేటింగ్ : 3/5

చివరగా: బిటెక్ బాధితులు తప్పకుండ చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్  ‘కిస్మత్ ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here