కార్తీక్ రాజు హీరోగా శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ చిత్రం ‘ఐ హేట్ యు’.. త్వరలోనే రిలీజ్‌కు సన్నాహాలు

0
141

‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఐ హేట్ యు’. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్బంగా..

చిత్ర నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

నటీనటులు:

కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ తదితరులు

సాంకేతిక వర్గం:

చిత్ర సమర్పణ – బి.లోకనాథం, బ్యానర్- శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత – నాగరాజు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – అంజి రామ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ – అనూష, కో ప్రొడ్యూసర్ – విష్ణు తేజ స‌ర్విశెట్టి, నిర్మల్ కుమార్ రాజు, సినిమాటోగ్రఫీ – ఎస్.మురళీ మోహన్ రెడ్డి, మ్యూజిక్ – సాకార్, ఒరిజినల్ స్టోరి, డైలాగ్స్ – ప్రభోద్, ఎడిటర్ – జె.ప్రతాప్ కుమార్, స్టంట్స్ – రామకృష్ణ, కొరియోగ్రాఫర్ – అనీష్, పి.ఆర్.ఒ – మోహన్ తుమ్మల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here