వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫిబ్రవరి16 2024న విడుదల- త్వరలో టీజర్

0
111

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం’ఆపరేషన్ వాలెంటైన్’ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ లో ఒక విజువల్ వండర్ గా ఉండబోతుందని ప్రామిస్ చేస్తోంది. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటిస్తున్నారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎయిర్‌ఫోర్స్‌పై తొలి చిత్రం.

సినీ ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభూతిని కల్పిస్తామని నిర్మాతలు ఇటీవల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మోషన్ టీజర్‌తో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ 16 ఫిబ్రవరి 2024న గ్రాండ్ గా విడుదల కానుంది. వరుణ్ తేజ్,  మానుషి చిల్లర్ అతిపెద్ద వైమానిక దాడుల్లో ఒకదానికి సిద్ధమవుతున్నందున అద్భుతమైన మోషన్ టీజర్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రపంచం గురించి ఒక గ్లింప్స్ గా ప్రజెంట్ చేస్తోంది.

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’  దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ఎంటర్‌టైనర్ . మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్యసాహసాలని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపనుంది.

‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్) సహా నిర్మాతలు.

అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్ . ఈ చిత్రం తెలుగు,  హిందీ భాషలలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here