రాకింగ్ స్టార్ మంచు మనోజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్ లైన్. ‘వాట్ ది ఫిష్’ హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్ విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు.
మనోజ్ ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపంతో చాలా క్రేజీ గా కనిపించారు. బ్యాగ్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం కూడా గమనించవచ్చు. ఇందులో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీ గా ఉంటుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది.
Too much of Craziness with the Comedy Badshah & our very own Kaka @vennelakishore ❤️🔥
Witness his CRAZY AVATAR in #WhatTheFish 😍
Exploding soon on the big screens 💥@afilmbyv 🎥@HeroManoj1#Varun @6ixCinemas #VishalBezawada #SuryaBezawada #Shaktikanth pic.twitter.com/qV3vpXf4J1
— BA Raju's Team (@baraju_SuperHit) October 16, 2023
ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగింది, ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నికల్ టీం పని చేస్తుంది. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: మనోజ్ మంచు, వెన్నెల కిశోర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వరుణ్ కోరుకొండ
నిర్మాతలు: విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ
బ్యానర్: 6ix సినిమాస్ & afilmbyv
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ
పీఆర్వో: వంశీ శేఖర్