‘మంత్ ఆఫ్ మధు’ ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్

0
159

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా ని నిర్వహించారు మేకర్స్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నిర్మాతలు యశ్వంత్, దామ నాకు మంచి స్నేహితులు. దర్శకుడు శ్రీకాంత్ తీసిన భానుమతి & రామకృష్ణ చూశాను. అందులో చాలా క్లిష్టమైన ఎమోషన్స్ వున్నాయి. ‘మంత్ ఆఫ్ మధు’ లో కూడా అలాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. నవీన్ ని చూస్తే నాకు చాలా అనందంగా వుంటుంది. అన్ని రకాల పాత్రలు చేస్తుంటారు. ఇందులో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. స్వాతి నాకు చాలా మంచి స్నేహితురాలు. ఈ సినిమాతో తనకి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా వున్నాం. చాలా మంచి కథ. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. నటీనటులందరూ చక్కగా చేశారు. ఇందులో శ్రేయా చాలా మంచి పాత్ర చేసింది. ఈ సినిమా తనకి మంచి ఫ్లాట్ ఫామ్ కావాలని ఆశిస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు. అక్టోబర్6న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

 

స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను, నవీన్ తో పాటు చాలా మంది మంచి నటులు ఉన్నారు. శ్రేయా అద్భుతంగా నటించింది. సినిమా చూసిన అందరూ సర్ప్రైజ్ అవుతారు. అలాగే హర్ష పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొత్త హర్ష కనిపిస్తారు. దర్శకుడు శ్రీకాంత్ అద్భుతంగా తీశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు

 

దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మంత్ ఆఫ్ మధు” తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు.

 

యశ్వంత్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు. ఈ ఈవెంట్ కి ఆయన రావడం చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శకుడు, టీం ఎఫర్ట్ తోనే సినిమాని మీ ముందుకు తీసుకురాగలిగారు. నవీన్, స్వాతి గారు నటీ నటులంతా అద్భుతంగా చేశారు. సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు. ఈ ఈవెంట్ లో రాజారవీంద్ర, హర్ష, శ్రేయాతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొ

న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here