టాలీవుడ్ హిస్టరీలో అంజలి నటించిన `గీతాంజలి` సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న `గీతాంజలి` సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ `గీతాంజలి` సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేకర్స్.
`గీతాంజలి మళ్లీ వచ్చింది` అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెన్నులో వణుకు తెప్పించే స్పైన్ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేకర్స్. `గీతాంజలి మళ్లీ వచ్చింది` సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. కోన వెంకట్ సగర్వంగా సమర్పిస్తున్న సినిమా `గీతాంజలి మళ్లీ వచ్చింది`. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు.
ఓ పాడుబడ్డ బంగ్లా ప్రాంగణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తూ, ఆకట్టుకుంటోంది.
#GeethanjaliMalliVachindhi shoot has kicked off & here are some exclusive pics from the Pooja ceremony ✨
Stay tuned for more thrills and chills 👻#Anjali50
Presented by @konavenkat99
Produced by @MVVCinema_@yoursanjali @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/PpsqyIg0s7— BA Raju's Team (@baraju_SuperHit) September 23, 2023
`గీతాంజలి మళ్లీ వచ్చింది` సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా డైరక్టర్ శివ తుర్లపాటికి అందజేశారు.
`గీతాంజలి మళ్లీ వచ్చింది` చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్ (డబ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, భాను భోగవరపు, మాటలు: భాను భోగవరపు, నందు శవరిగణ, దర్శకత్వం: శివ తుర్లపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, పీ ఆర్ ఓ: వంశీ కాక, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను.